Breaking News

తాజా వార్తలు

ఘనంగా ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలు

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలను ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి రామకృష్ణ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ రూరల్‌లో ఆయా గ్రామాల్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. Email this page

Read More »

బిజెపిపై దుష్ప్రచారం మానుకోండి

  – బిజెపి ఎస్‌సి మోర్చా జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్‌ నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలం అభంగపట్నంలో జరిగిన సంఘటనలో బిజెపికి ఎలాంటి సంబందం లేదని బిజెపి ఎస్‌సి మోర్చా జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భరత్‌రెడ్డికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఈ విషయంపై గతంలోనే బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎండల లక్ష్మినారాయణ …

Read More »

ఉత్తమ క్రీడాకారుడుగా ఎంపికైన ఆకుల రవి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల క్రీడల్లో జాతీయ స్థాయిలో పార్కు బాల్‌, బేస్‌ బాల్‌, బాస్కెట్‌ బాల్‌ విభాగాల్లో విజయాలు సాధిస్తూ 2013 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ క్రీడల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఆకుల రోహిత్‌ను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తమ క్రీడాకారునిగా గుర్తించింది. వచ్చేనెల డిసెంబరు 3న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఆకుల రోహిత్‌ నిజామాబాద్‌ డిసిపి (అడ్మిన్‌) ఆకుల రాంరెడ్డి కుమారుడు. Email …

Read More »

22న శత కళ్యాణ మహోత్సవం

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఈనెల 22వ తేదీన స్థానిక మున్నూరు కాపు సంఘంలో శత కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు నగర మాజీ మేయర్‌ సంజయ్‌ తెలిపారు. ఆదివారం మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ధర్మపురి ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటి వరకు 100 పెళ్ళిళ్ళు చేయడం జరిగిందని, ఈనెల 22వ తేదీన మరో 25 పెళ్ళిళ్ళు జరిపిస్తున్నట్టు ఆయన తెలిపారు. హిందూ మతంతోపాటు సర్వ …

Read More »

ఐటి హబ్‌ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయదలచిన ఐటి హబ్‌ కొరకు స్థలాన్ని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త ఆదివారం పరిశీలించారు. స్థానిక డ్వాక్రా బజార్‌లోగల మూడున్నర ఎకరాల స్థలాన్ని ఇందుకోసం గుర్తించడం జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, ఆర్డీవో వినోద్‌, తహసీల్దార్‌ సుదర్శన్‌, తదితరులున్నారు. Email this page

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద విడుదలైన చెక్కులను ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అందజేశారు. 5.40 కోట్ల రూపాయలు ముక్యమంత్రి సహాయనిది కింద బాధిత కుటుంబాలకు విడుదలైనట్టు తెలిపారు. నియోజకవర్గంలోని బీబీపేట, భిక్కనూరు మండలాలకు చెందిన 12 మందికి రూ. 7 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, రాజేశ్వర్‌, లక్ష్మారెడ్డి, బల్వంత్‌రావు, మోహన్‌రెడ్డి, మామిండ్ల రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు. Email …

Read More »

సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయించింది తెలంగాణయే

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసి అత్యధిక నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాత బాన్సువాడలోని పెద్దవాగుపై రూ. 2.5 కోట్లతో నిర్మించిన వంతెనను, వినాయక్‌నగర్‌లో రూ. 27.5 లక్షలతో నిర్మించిన శ్రీ శ్రీనివాస కళ్యాణమండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల కోసం ప్రత్యేకంగా …

Read More »

సామాజిక తెలంగాణ కోసం పోరాడుదాం

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ కోసమే పోరాడుదామని సిపిఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం సిపిఐ ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం రౌండ్‌ టేబల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నర్సింహారెడ్డి మాట్లాడుతూ సామాజిక తెలంగాణయే లక్ష్యంగా సిపిఐ పోరుబాటలో భాగంగా 26న కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి …

Read More »

ఎంబిసి వర్గాల సమస్యల పరిష్కారానికి ఉద్యమం

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంబిసి వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమమే శరణ్యమని రాష్ట్ర ఎంబిసి ఉపాధ్యక్షుడు డాక్టర్‌పుట్ట మల్లికార్జున్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ కార్పెంటర్‌ అసోసియేషన్‌ సంఘం భవనంలో ఆదివారం ఎంబిసిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంబిసిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వడ్రంగులు వెనకబడి ఉన్నారని పేర్కొన్నారు. సంఘం ఆద్వర్యంలో ఎంబిసిల అభ్యున్నతికి పాటుపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంబిసి నాయకులు విజయ్‌కుమార్‌, శ్యాంరావు, మారుతి, రఘుపతి, …

Read More »

మహర్షి దయానంద సరస్వతి బలిదాన దినం

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్యనగర్‌ కాలనీలోని ఆర్యసమాజంలో ఆదివారం మహర్షి దయానంద సరస్వతి బలిదాన దినం నిర్వహించారు. వక్తలు వైది క పురోహితులు తమ సందేశాలను వ్యక్తం చేశారు. వైదిక ధర్మానికి, సకల మానవ సుఖ సంతోషాలకు వేద మార్గమే సరైందన్నారు. వేదాధ్యయనం చేసి వేదాలను, సంస్కృతిని కాపాడాలని కోరారు. అనంతరం హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆచార్య లింబాద్రిస్వామి, కంకణాల కిషన్‌, విశ్వనాథం, సులోచనమ్మ, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

ఛలో పార్లమెంటు గోడప్రతుల ఆవిస్కరణ

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల పంటలకు గిట్టుబాటు ధరల కోసం నవంబర్‌ 20న ఛలో డిల్లీ, చలో పార్లమెంటు కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను ఆదివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసి జిల్లా కమిటీ నాయకులు రాజయ్య, ఐఎఫ్‌టియు నాయకుడు ఖాజామోయినుద్దీన్‌లు మాట్లాడుతూ స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం పంటల ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం పెంచి గిట్టుబాటు ధర అమలు చేయాల్సి ఉందన్నారు. దీనికోసం నవంబర్‌ 20, 21 తేదీల్లో …

Read More »

జాగృతి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

  గాంధారి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పోతంగల్‌ కలాన్‌ గ్రామంలో ఆదివారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. శిబిరంలో 650 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. గాంధారి మండల జాగృతి కన్వీనర్‌, జిల్లా జాగృతి కోశాధికారి చక్రధర్‌ ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఏడుగురు వివిధ రంగాల వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు జరిపారు. కార్యక్రమానికి ఉదయం …

Read More »

భూ ప్రక్షాళన సందర్శించిన కలెక్టర్‌

  కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గున్కుల్‌ గ్రామంలో జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సందర్శించారు. గ్రామంలోని రైతులతో సమీక్షజరుగుతున్న తీరుపై మాట్లాడారు. భూ ప్రక్షాళన ఎలా జరుగుతుంది, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. రైతులు, అధికారులు సమన్వయంతో ఉండి, భూ ప్రక్షాళన విజయవంతం చేయాలని తద్వారా రైతులు లబ్దిపొందుతారని సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు. Email this page

Read More »

కూరగాయల సంతను సందర్శించిన మంత్రి పోచారం

  నిజాంసాగర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో సహకార సంఘ వారోత్సవాల సందర్భంగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో వారం సంత వద్ద ఆగి సంతను పరిశీలించారు. కూరగాయల విక్రయదారులు, కొనుగోలు దారులతో మాట్లాడారు. సహజమైన నీటిపారుదల వ్యవస్థ కంటే బిందు సేద్యంతో తక్కువ నీటితో పంట సాగవుతుందన్నారు. మంచి దిగుబడులు కూడా పొందవచ్చని మంత్రి సూచించారు. అవసరమైన రైతులు ఉద్యానవన శాఖకు దరఖాస్తులు చేసుకోవాలని రైతులకు సూచించారు. Email …

Read More »

రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది

  నిజాంసాగర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌లో నిర్వహిస్తున్న సహకార సంఘ వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి మంత్రి మాట్లాడారు. తెలంగాణలో సహకార సంఘాలకు 900 కోట్ల నిధులను మంజూరు చేసిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహకార సంఘాల రైతులకు 17 కోట్ల రుణాలను మాపీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాలకు నీరందించడం …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">