Breaking News

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా.. జిల్లాకు మొండి చేయి ఎన్నికల హామీలు గల్లంతే

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా..  జిల్లాకు మొండి చేయి  ఎన్నికల హామీలు గల్లంతే

నిజామాబాద్‌  నవంబరు 5:  తెలంగాణ రాష్ట్ర తొలి పద్ధు నిజామాబాద్‌ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పది నెలలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989.49 కోట్లు, ఆర్థిక లోటు ఆంచనా రూ.17,398.72 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.301.02 కోట్లుగా ఉంది. ఇంతటీ భారీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన నిజామాబాద్‌ జిల్లాకు మాత్రం మొండి చేయి చూపించింది. కేసిఆర్‌ ఎన్నికల్లో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ బడ్జెట్‌లో కాసింతాయైన నెరవేరుస్తాయనే ఆశలు పెట్టకున్నారు.హామీల సంగతి ఏలా ఉన్నా అభివృద్ధి పనులకు కూడా నిధుల జాడ కరువైంది. హామీల్లో ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన ఎర్ర జోన్నల బకాయిలు తప్పా, మిగిలిన సమస్యల ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరం. ఎర్రజోన్నలకు సంబంధించిన రూ.11.50 కోట్ల మీనహా జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బడ్జెట్‌లో కనీసం జిల్లాకు ఇచ్చిన హామీల ప్రస్తావన కూడా లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు.

ఎర్రజోన్నలు రూ.11.50 కోట్లు

జిల్లాలో ఎర్రజోన్నలు పండించడం ప్రత్యేకత. ఈ ఎర్రజోన్నల బకాయిల వ్యవహారం రాజశేఖర్‌రెడ్డి హయం నుంచి రూ.11.50 కోట్లు పెండిండ్‌లోనే ఉన్నాయి. వీటీని ఇటీవల సీఎం కెసిఆర్‌ ఆర్మూర్‌ పర్యటనకు వచ్చినప్పుడు బకాయిలు చేల్లిస్తామని హామీ ఇచ్చారు. మరుసాటి మాసంలోనే బకాయిలను రైతులకు పంపిణి చేసారు. బడ్జెట్‌లోనూ ఆర్థిక మంత్రి ప్రాస్తావించారు. కానీ మిగిలిన సమస్యల ప్రస్తావన లేకపోవడం విశేషం.

పసుపు పరిశోధన కేంద్రం, లేదర్‌ పార్క్‌ జాడేది…

పసుపు ఉత్పత్తికి నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ ప్రధాన కేంద్రం. ప్రపంచంలోనే ఇక్కడి పసుపుకు ఓ ప్రత్యేకత ఉంది. పసుపును ప్రపంచ స్థాయిలోనే మరింత నాణ్యతతో ఉండేందుకు, అలాగే వివిధ రకాల తయారికి ఉపయోగపడేలా పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కెసీఆర్‌ ఎన్నికల్లో హామీ ఇవ్వడమే కాకుండా ఆర్మూర్‌ పర్యటనలోనూ ప్రస్తావించారు. అలాగే ఎం.పి. కవిత కూడా పలుమార్లు ఈ ప్రస్తావించి

ఈ ప్రస్తావనను తీసుకువచ్చి హామీ ఇచ్చారు. కాని బడ్జెట్‌లో నామ మాత్రానికి కూడా ప్రస్తావన లేకపోవడం గమనర్హం. ఇదే తరహాలో ఆర్మూర్‌లో ఏర్పాటుకు హామీ ఇచ్చిన లేదర్‌ పార్కు ముచ్చట పూర్తిగా మరుగున పడిపోయింది.

టియూ, మెడికల్‌ కాలేజ్‌కి మొండి చేయి ..

తెలంగాణ పేరుతో ఏర్పాడిన తెలంగాణ యూనివర్శిటీకి, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌కి బడ్జెట్‌లో మొండి చేయి చూపారు. టీ యూ అభివృద్దికి పైసా కేడా కెటాయించకపోగా కనీసం బడ్జెట్‌లో ప్రస్తావన కూడా లేదు. ఇదే తరహాలో మెడికల్‌ కాలేజీది కూడా అదే తీరు. జిల్లాకే తలమానికం అయిన ఈ రెండు విద్య సంస్థలు నిధుల లేమితో కోట్టుమిట్టు ఆడుతున్నాయి. యూనివర్శిటీలు కనీస సౌకర్యాలు లేకపోవడం, నాలుగో తరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు పోస్టులు ఉండటమే కాకుండా కొంత కాలంగా వైస్‌చాన్స్‌లర్‌, రిజిస్టార్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో యూనివర్శిటీలో విద్యభ్యాసం నామ మాత్రతంగానే కోనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణ యూనివర్శిటీ గురించి చర్చించలేదు. ఇటీవల విద్యశాఖ మంత్రి స్వయంగా యూనివర్శిటీని సందర్శించి పరిస్థితులను పరిశిలించారు. ఇంత జరిగిన పైసా కూడా కెటాయించపోవడంపై విద్యార్ధి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే  మెడికల్‌ కాలేజ్‌ మరింత ఆధ్వనంగా ఉన్నది. ఈసారి బడ్జెట్‌లోనైనా నిధుల కెటాయింపు జరిగి అభివృద్దికి దారులు సుగమనం అవుతాయని ఆశించారు. గత నెలలో స్వయనా డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి రాజయ్య మెడికల్‌ కాలేజ్‌ను సందర్శిశించిన ఫలితం లేకుండా పోయింది

పోయింది. నిధులు లేక అభివృద్ది కుంటు పడటమే కాకుండా ఇప్పటికి వరకు పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో వెనుకబాటు తప్పడం లేదు.

గల్ప్‌ బాధితులు, బీడీ కార్మికులు

బడ్జెట్‌ ప్రస్తావనలో గల్ఫ్‌ బాధితుల సమస్యను మాత్రమే వివరించిన ఆర్ధిక మంత్రి పూర్తి స్థాయిలో ఏలాంటి హామీ ఇవ్వాలేకపోయారు.నిరుద్యోగంతో గల్ప్‌ బాట పట్టిన వారు తిరిగి వస్తే వారిని అదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజిని ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేతప్పా దానిలో ఏలాంటి స్పష్టత లేదు. ఇప్పటి ఉత్తర తెలంగాణ జిల్లాలోని వేలాధి మంది యువకులు గల్ఫ్‌ బాట పట్టి తీరాని వ్యధలను భరిస్తున్నారు. కనీసం అక్కడ మరణిస్తే సకాలంలో తీసుకు వచ్చేందుకు ప్రభత్వుం ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే తరహాలోనే లక్షల సంఖ్యలో మహిళలు బీడీ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరికి ఎన్నికల్లో భారీగా హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు బడ్జెటల్‌ వీరిగురించి మాటను కూడా మరిచిపోయారు. బీడీల తయారిలో పోగాకు, తునికాకు వాడకం కారణ:గా క్యాన్సర్‌లాంటి రోగాల భారీన పడి దీర్ఘకాలిక వ్యాధులతో మరణిస్తున్నారు.

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ…

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని హామీ ఇచ్చిన కేసిఆర్‌ బడ్జెట్‌లో కెటాయింపుల మాట అటు ఉంచిన కనీసం ప్రస్తావన తీసుకు రాకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాడి ఆరు నెలలు గడుస్తున్న సీఎం దీనిపై ఏలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

తెలంగాణా ఆర్థిక మంత్రి తోలి బడ్జెట్ పూర్తి పాఠం. డవున్లోడ్ చేసుకోండి

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు గ్యారెంటీ ...

Comment on the article