Breaking News
political crime

మాజీ ఎంపీ మధుయాస్కీపై కేసు

 

నిజామాబాద్‌, నవంబరు 06,

నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాస్కీపై చెల్లని చెక్కు కేసును నమోదు నాంపల్లి కోర్డు మంగళవారం ఆదేశించింది. కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన బురుగు రామస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ఖర్చుల కోసం మధుయాస్కీ బురుగు రామస్వామిగౌడ్‌, పడాల నారాయణ, భీమిరెడ్డిల నుంచి రూ.30 లక్షల చోప్పున అప్పుగా తీసుకున్నారు. రూ.90 లక్షలు ఏప్రిల్‌ 2014లో తీసుకున్నట్లు వారు పేర్కోన్నారు. ఈ డబ్బుల నిమిత్తం మధుయాస్కీ జూన్‌ 11, 2014 తేదితో కూడిన హైదరాబాద్‌ బంజరాహిల్స్‌ సిండికేట్‌ బ్యాంకు చెక్కును ఇచ్చారు. సెప్టెంబరు 3, 2014న బ్యాంకులో చెక్కును జమ చేయగా ఖాతాలో నిల్వ లేదంటు అధికారులు చెక్కును తిప్పిపంపారు. దీనిపై బాధితులు యాస్కీని సంప్రదించగా బెదిరించారని ఫిర్యాదు చేసారు. ఈ మేరకు న్యాయస్థానం యాస్కీపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

Check Also

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు ...

Comment on the article