Breaking News
బిసి నాయకులకు సన్మానం

బిసిలను నిర్లక్ష్యం చేస్తే తడఖా చూపుతాం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల

నిజామాబాద్‌, నవంబరు 8,

బిసిలు అంటే ఆశించే వాళ్లం కాదని, శాసించే వాళ్లమని ప్రభుత్వం పెద్దలు గుర్తు ఉంచుకొవాలని, బిసిలను తెలింగాణ ప్రభుత్వం బడెజట్‌లో నిర్లక్ష్యం చేసిందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం అంబేద్కర్‌ భవన్‌లో సంఘంలో పదవులు పొందిన బిసి నేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బిసిల కోసం నిజామాబాద్‌ జిల్లా నుంచి విద్యార్థి నాయకుడుగా శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగ సంఘం నాయకుడు రేవంత్‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఏన్నో విధాలుగా కృషి చేసారని, అందుకే వీరి ప్రత్యేకంగా గౌరవించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసిలను పూర్తిగా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, ఈ తీరు మార్చుకోక పోతే బిసిలు ఉద్యమించాల్సి వస్తుందన్నారు. బిసి విద్యార్థులందరికి బేషరత్తుగా ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్సిమెంట్‌ను అందించాలన్నారు. 2019లో తెలంగాణకు బిసినే ముఖ్యమంత్రి చేయాలని, అందుకు అన్ని వర్గాల వారు సిద్దం కావాలన్నారు.

Check Also

భైంసాలో ఇంటర్‌నెట్‌ సేవలు బంద్‌

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైంసాలో ఆదివారం అర్ధ రాత్రి ఒక వర్గానికి చెందిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *