Breaking News

నగరపాలనలో ఉత్తమమైన సేవలు అందించుటకు బదిలీలు

 

నిజామాబాద్‌, నవంబరు 21,

నగర పాలక సంస్ధలో ఉత్తమమైన సేవలు ప్రజలకు అందించుటకు బదిలీలను చేపట్టడం జరిగిందని నగరమేయర్‌ అకులసుజాత స్పష్టం చేశారు. శుక్రవారం కార్పొరేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నగరమేయర్‌ అకులసుజాత మాట్లాడుతూ జిల్లా ఎంపి.కవిత,అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌గుప్త సహాయసహకారాలతో ఈ పట్టణాన్ని అభివృద్ది పథములో నడుపుటకుగాను ఉన్నామని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఒకేచోట పని చేస్తున్న వర్క్‌ఇన్స్‌పేక్టర్లను అసిస్టెంట్‌ ఇంజనీర్లను ఒకజోన్‌నుండి మరోక జోన్‌కి బదీలీలు చేయడం జరిగిందని తెలిపారు. పెన్షున్లు,అహారభద్రత కార్డుల తనఖీలు కొరకు నగరపాలక సంస్థ ఉద్యోగులు విధులలో ఉన్నందున అయా రకాల సేవల విషయంలో జాప్యం జరిగినందున అత్యవసర సర్వీసులైనటువంటి జనన,మరణ,ధృవపత్రముల జారీ విషయంలో పరిగణములోకీ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు నగరపాలక సంస్ధకు మంచి పేరుతేవాలని కోరారు. ఈ సమావేశంలో ఉపకమీషనర్‌ మంగతాయరు,కార్పొరేటర్‌ విశాలినిరెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

పోలింగ్‌ పర్సెంట్‌ @1 పిఎం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి నిజామాబాద్‌ పార్లమెంటరీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *