Breaking News

ఆసరా రాలేదంటూ వృద్దుల రాస్తారోకో

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 15:

ఆసరా ఇవ్వండి సారూ…. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందంటూ వృద్దులు రోడ్డెక్కారు. అర్హులమైన తమకు ఆసరా రాలేదని పెన్షన్‌దారులతో కిక్కిరిసిపోయింది జిల్లా కలక్టరేట్‌ ప్రాంగణం. పరిసరాలు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వృద్దులు చేరుకుని తమకు పించన్లు రాలేదంటూ కలెక్టరేట్‌వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా సామాజిక పింఛన్లు రాని వందలాది మంది వృద్దులు తమతో వచ్చిన సహాయకులతో పాటు రోడ్డుపై బైఠాయించి గంటసేపు రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలు ఆదిలాబాద్‌, ఆర్మూర్‌, జగిత్యాల్‌, వరంగల్‌, హైదరాబాద్‌ రోడ్డు, బాన్సువాడ నుంచి రాకపోకలు సాగించే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసందర్భంగా పోలీసులు సంయమనం పాటించి వారిని సముదాయించే యత్నం చేశారు. దాదాపు గంటపాటు రోడ్డుపై నిరసన తెలిపిన వృద్దులు పోలీసులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. పెన్షన్లురాక తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు గోడు వెళ్లబోసుకున్నారు. తాము అర్హులమైనా తమ పేర్లు తొలగించారంటూ కొందరు, తమ పర్లు నమోదుచేయలేదని తప్పుగా చేశారని మరికొందరు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తమకు వృద్దాప్య పింఛన్లు 1500 వస్తాయని ఆశపెట్టిన ముఖ్యమంత్రి తీరా ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక ఆసరా పథకం పేరిట వృద్దులకు పింఛన్లు అందరికి ఇస్తామంటూనే 60 ఏళ్లు దాటిన వారికి ఇవ్వడంలేదని, 65 ఏళ్ల వయస్సుగలిగిన వారికే పింఛన్లు ఇస్తామంటూప్రభుత్వం అనేకమంది నిరుపేద వృద్దులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. జిల్లాలో వేలాది మంది నిరుపేదలు వృద్దులైన వారికి ఆసరా పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైందని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు అర్హులైన వృద్దులందరికి పించన్లు అందచేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు.

మరోవైపు పెన్షన్లు పంపిణీచేసేందుకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నగరంలోని మున్సిపల్‌ పరిధిలో పలుచోట్ల ఈ ఆసరా పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన పింఛన్లు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పెన్షన్లు మంజూరుకాలేదంటూ సోమవారం ఉదయం నుండే వృద్దులు కలెక్టరేట్‌కు చేరుకోవడం కనిపించింది, 11 గంటలకే కలెక్టరేట్‌ పరిసరాలు వృద్దులతో కిటకిటలాడింది. నలువైపులా ఏ రోడ్డు చూసినా అధికారులను నిలదీశారు. కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్‌దారులు రాస్తారోకోలో పాల్గొని తమ నిరసన తెలిపారు.

ప్రజావాణిలో వినతులను కలెక్టర్‌ పరిశీలించి సత్వరం పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కాగా పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌ ప్రాంగణంలో వృద్దులు తరలిరావడంతో వారికోసం ఆవరణలోనే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసి వారి వినతులను స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ స్వయంగా పలువురు వృద్దుల సమస్యలు ఎంతో ఓపికతో విని వారి దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులను పరిష్కరించాలని సూచించారు.

=====

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *