Breaking News

పడిగాంపులు కాస్తున్న పెన్షున్ల లబ్దిదారులు

నిజామాబాద్‌,డిసెంబర్‌ 15:

తెలంగాణ ప్రభుత్వ ప్రకటించిన అసరా పెన్షునులతో ప్రజలు ప్రతి నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నారు. సోమవారం పెన్షున్ల కొరకు వృద్దులు, వికలాంగులు,వితంతువులు పెద్ద ఎత్తున్న తరలి ఎన్టీఅర్‌ చౌరస్తా వద్ద అందోళనలు చేశారు.అనంతరం కార్పొరేషన్‌ కార్యాయలం ఎదట పెన్షున్ల కొరక బారులు తీరిగారు. అధికారులు స్పందించడం పోవడంతో వారు తిరిగి కలెక్టర్‌ రెట్‌లో సంయుక్త కలెక్టర్‌శేషాద్రి ఇతర అధికారులకు తమ పెన్షున్ల ఫారలను అందజేశారు. అనంతరం పెన్షున్ల లబ్దిదారులు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఏర్పడి ప్రయోజనం లేదని గతంలో ఇచ్చిన 200 రూపాయలు ఇస్తే సరిపోతుందని లేనిపోని అశలను వృద్దులకు వికలాంగులకు తెలిపి పలు ఇబ్బందులకు గురి చేయడం అన్యాయంమని అరోపించారు.నిజామైన అర్హులైయి ఉండి ప్రతి నిత్యం కార్యాలయల చుట్ట తిరిగి వచ్చే డబ్బులు రావడం ఎమోగాని? అటోల చార్జిలకే తమ ఖర్చులు అవుతున్నాయని కనీసం తెలంగాణ ప్రభుత్వం అలోచనలు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు.చాలా సమయం కలెక్టర్‌ రెట్‌ తమ నిరసనలతో అందోళనలు చేసి తిరిగి వెళ్లరు.

Check Also

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *