Breaking News

బిచ్కుంద ఇసుక క్వారీ నిలిపివేయండి … కలెక్టర్‌కు గ్రామస్తుల మొర

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 15:

బిచ్కుంద మండలం పుల్‌కల్‌, వాజీద్‌నగర్‌, గుండా నెమిలి, బండ రెంజల్‌ గ్రామాల్లోని ఇసుక క్వారీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తీయడంవల్ల సమీప వ్యవసాయ బోర్లు నీరులేక అడుగంటిపోతున్నాయని గ్రామస్తులు కె.సాయిలు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన వినతివత్రంలో పేర్కొన్నారు. మంజీరానద నుంచి ప్రతి రోజు భారీ సంఖ్యలో పొక్లయినర్లతో లోతుగా తవ్వి ఇసుక తీస్తున్నారని దీంతో తమ గ్రామాల్లో బోర్లలో నీరు రావడంలేదని తాము ఇదివరకు పలుమార్లు మండల జిల్లా అధికారులకు అనేకమార్లు ఫిర్యాదులు చేశామని వారు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఇసుక ఇక్కడినుంచి లారీల్లో పొక్లెయినర్లతో పెద్ద సంఖ్యలో తరలించారని, భారీ వాహనాల రాకపోకలవల్ల రోడ్డు సైతం దెబ్బతింటుందని, దప్రతిరోజు ఈ తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంవల్లనే అక్రమ వ్యాపారులు ఇసుకను తరలించుకపోతున్నారని వారు ఆందోళనవ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్‌ తమ సమస్యలను గుర్తించి ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *