Breaking News
సమీక్షిస్తున్న కలెక్టర్‌

గోదావరిపుష్కరాల ఏర్పాట్లకు సమాయత్తం కావాలి… జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15:

జూలై మాసంలో జరగబోవు గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు , అలాగే అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్‌ అంచనాలతో ప్రతిపాదనలు వెంటనే రూపందించిఅందజేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ఛాంబర్‌లో గోదావరి పుష్కరాలకు సంబందించి ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి అధికారులతో చర్చించారు. దేవాలయాలు, చరిత్ర సంస్కృతి, జిల్లా విశిష్టతను తెలిపే ప్రచురణలను రూపొందించాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ టి.సోమయ్యను కలెక్టర్‌ ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఆయా దేవాలయాలు పుష్కరఘాట్లు వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు , రోడ్లు, పార్కింగ్‌ స్థలాలు, పుష్కరఘాట్లు మరమ్మతులు, కొత్త ఘాట్లు ఏర్పాట్లకు శాఖల వారీగతా నిర్ధిష్ట అంచనాలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆయాశాఖలు పుష్కరాలవద్ద నిర్వహించే కార్యక్రమాల వివరాలు తెలియజేసేవిధంగా పుస్తకాలు రూపొందించాలని సూచించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు సామాన్య జనాలకు ఏమాత్రం అసైకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లుచేయడంలో నిర్లక్ష్యంచేయరాదని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ మనోహర్‌,ట్రాన్స్‌కో ఎస్‌ఇ శ్రీనివాస్‌రెడ్డి, సమాచార శాఖ ఎడి పవన్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *