Breaking News
మాట్లాడుతున్న ఎఐసిసి నేత కుంతియా

సోనియా సేవలను మరవకూడదు… ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా

ిజామాబాద్‌, డిసెంబరు 16 ;

సోనియా గాంధీ సేవలను ప్రతి కార్యకర్త మరవకూడదని, ఆమె కారణంగానే మనకు తెలంగాణ రాష్ట్ర వచ్చిందని ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా అన్నారు. సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న సభ్యత్వం విజయవంతం అవుతుందని, ప్రతి కార్యకర్త మరింత దృడ దీక్షతో పని చేయాలని సూచించారు.

స్వాతంత్య్రం వచ్చిన నుంచి కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ఏంతో సేవ చేసిందని, అదే కోవలో సోనియ గాంధీ, రాహుల్‌ గాంధీల కుటుంబం పార్టీ కోసం అంకీత భావంతో పని చేస్తుందన్నారు.ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త ఉండేలా కార్యకర్త పని చేయాలని, అందుకు నాయకులు సైతం ముందుండి ప్రోత్సహించాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై పార్టీ తప్పకుండా క్రమశిక్షణ చర్యలు చేపడుతుందని, కాబట్టి ప్రతి నేత క్రమశిక్షణతో పని చేయాలని, గ్రామాల్లో యువతకు సభ్యత్వం చేయించి సమరస్యాంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్మేల్సీ డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికార పార్టీలో పదవుల కోసం కొందరు పార్టీ విడుతున్నారని, అలాంటి వారిని పట్టించి కోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికే అన్ని రకాల అవకాశాలు ఉంటాయని అన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పాల్గోన్నారు. అనంతరం ఎఐసిసి నేత కుంతియా బోధన్‌ రోడ్డులోని క్లాసిక్‌ పంక్షన్‌ హాల్‌లో జరిగిన మైనారిటీల సమావేశానికి హాజరై ప్రసంగించారు.

[youtube=”https://www.youtube.com/watch?v=Ui48CGyacWw” title=”Ramachandra Khuntia visit to Nizamabad”]

Check Also

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *