Breaking News

20వ తేదీన కార్పొరేషన్‌ ముందు ధర్నా.

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16;

ప్రజా సమస్యలను విస్మరించిన రాష్ట్రప్రభుత్వం కాలాయాపన చేస్తోందని నాయక్‌వాడి లింగం అన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లొ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పించన్‌ల పంపినీ కార్యక్రమం సరిగా చేయడంలేదని చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఆహార భద్రతా కార్డుల విష్ట్రయంలొనూ అవకతవకలు జరిగాయని, ఇంతవరకు రేషన్‌ దుకాణాలలో సరుకులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఏ నెల 20వ తేదీన కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్యహిస్తామని, ప్రజల సమస్యలను పరిష్కరించెంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఐ(యం.ఎల్‌) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *