Breaking News
సమీక్షిస్తున్న ఎజెసి

క్రీడాకారులకు ఇబ్బందులు తలేత్తోద్దు… ఎజెసి శేషాద్రి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 16;

జల్లా కేంద్రంలో నిర్వహించే రాజీవ్‌గాంధీ ఖెల్‌ అభ్యాస్‌ రూరల్‌ గ్రామీణ క్రడలు అండర్‌-16లకు హాజరయ్యే బాల బాలికల క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎజెసీ శేషాద్రి అన్నారు. మంగళవారం తన చాంబరు పీడీ, పీఈటీలతో ప్రత్యేకంగా సమావేశం అయి రాష్ట్ర స్థాయి క్రీడలపై సమీక్షించారు. ఈనెల 18, 19, 20 తేదిలలో పోటీలు జరుగుతాయని, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫూట్‌బాల్‌ క్రీడలను పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌, సిఎస్‌ఐ గ్రౌడ్‌లో నిర్వహించాలని, అలాగే వెయిట్‌ లిప్టింగ్‌ను రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించాలని సూచించారు. 17న తోమ్మిది జిల్లాలకు సంబంధించి 400 మంది క్రీడాకారులు హాజరు అవుతారన్నారు. వీరిలో బాలికలకు నిర్మల హృదయ పాఠశాలలో, బాలురకు ఎంఎస్‌ఆర్‌ పాఠశాలలో విడిది ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల పాటు జరుగుతాయని, అందుకు సంబంధించి అధికారులు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డాఎస్పీ అనంద్‌కుమార్‌, డిఎస్‌డివో శర్మ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

Check Also

అన్నం పరబ్రహ్మ స్వరూపం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *