Breaking News
స్ట్రాబెరీ కేక్

స్ట్రాబెరీ కేక్

కావలసిన పదార్థాలు :
వరిపిండి – 15(గా.
బటర్ – 5(గా.
కోడిగుడ్లు – 4
తేనె – 2 స్పూన్స్
బేకింగ్ పౌడర్ – ఒక స్పూన్
కుంకుమ పువ్వు – ఒక టీ స్పూన్
ఉప్పు – కొద్దిగా,
క్రీమ్ – 25(గా.
మపిల్ సిరప్ – ఒక స్పూన్
నిమ్మరసం – ఒక టీ స్పూన్
స్ట్రాబెరీస్ – 50(గా.
పిస్తా – 2(గా.

తయారుచేసే విధానం :

  • ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి.
  • ఒక గిన్నెలో వరిపిండి, బటర్, రెండు కోడిగుడ్లు, తేనె, బేకింగ్ పౌడర్, కుంకుమ పువ్వు, ఉప్పు అన్ని బాగా మిక్స్ చేయాలి.
  • ఈ పిండిని కేక్‌పాన్‌లో వేయాలి. వేసేముందు పాన్‌కి కొద్దిగా బటర్ రాయాలి.
  • 15 నుంచి 20నిమిషాల పాటు ఓవెన్‌లో బేక్ చేయాలి. బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డులోని తెల్లసొన, క్రీమ్, నిమ్మరసం అన్ని వేసి బాగా కలపాలి. దీంట్లోనే మపిల్ సిరప్‌ని కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పోయాలి.
  • పై నుంచి స్ట్రాబెరీలను చిన్న ముక్కలుగా కట్‌చేసి డెకరేట్ చేయాలి. పై నుంచి పిస్తాతో గార్నిష్ చేయాలి. అంతే.. తియ్యటి స్ట్రాబెరీ కేక్ మీ ముందుంటుంది.
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

62 అడుగుల జుట్టు!

ప్రత్యేకం: జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. మహిళలు కేశాలపై అమితమైన ప్రేమను చూపుతుంటారు. రకరకాలుగా అందమైన జడలు అల్లి ఆకట్టుకుంటారు. అంతేకాదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *