Breaking News
మాట్లాడుతున్న ఎఎస్పీ పాండునాయక్‌

ప్రభుత్వ సామాగ్రిపై దృష్టి పెట్టండి…. ఎఎస్పీ పాండునాయక్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17

జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలనుండి దొంగిలించబడిన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి విషయంలో తగు చర్యలు తీసుకుని నివేదిక అందజేయాలని అడిషనల్‌ ఎస్పీ పాండునాయక్‌కు బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ తెలియచేశారు. వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అలమలు జరగాలంటే ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ పరస్పర తోడ్పాటు ఎంతైనా అవసరమని, అందువల్ల అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈత సమావేశంలో జిల్లా రోడ్ల నిర్మాణాలు, నీటి సరఫరా పథకాలు, వసతి గృహాలు తదితర మౌళక సదుపాయాలు , అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. రోడ్డునిర్మాణ పనులు చేస్తున్నపుడు ఆర్‌అండ్‌బి , ట్రాన్స్‌కో, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు సమన్వయంగా ఉంటూ ఇతర పనులకు ఆటంకం కలగకుండా పనులు సవ్యంగా జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ బకాయిలు చెల్లించేందుకెఉ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఉత్తర్వుల ప్రకారం బిల్లుల చెల్లింపుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాన్సువాడ నియోజకవర్గానికి అవసరమైన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల గురించి ఎస్‌ఇ శ్రీనివాస్‌ రెడ్డిని కలెక్టర్‌ ప్రశ్నించారు. 23 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరముండగా 15 ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చినట్లు ఎస్‌ఇ తెలిపారు. మిగతావి త్వరలో వస్తాయని తెలిపారు. వివిధ బ్యాంకుల్లోపనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు గన్‌ లైసెన్సు కోరుతున్నట్లు, వారికి లైసెన్సు మంజూరుకు తగు చర్యలు తీసుకోవాలని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రామకృష్ణారావును కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ మనోహర్‌, డిఆర్‌డిఎ పివి వెంకటేశం, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాజరత్నం, హౌజింగ్‌ పిడి చైతన్యకుమార్‌, అధికారులు పాల్గొనారు.

Check Also

గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయానుకునే వారికి శుభవార్త

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయాల‌నుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *