Breaking News
సమీక్షిస్తున్న కలెక్టర్‌

డివిజన్‌, మండల స్థాయిలో ప్రజావాణి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17

ప్రతిసోమవారం డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహశీల్దార్లు ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పకుండానిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజల నుండి వివిధసమస్యలు, ఇతర అంశాలపై వచ్చే ఆర్జీలను స్కానింగ్‌ చేసి ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి చర్యలుతీసుకుని పరిష్కరించడానికి జిల్లా అధికారులు, ఆయాశాఖల పర్యవేక్షకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, టైపిస్టులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీల సత్వరపరిష్కారం చేసిన అనంతరం సంబందిత ఆర్జీదారునికి సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అందించాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని శాఖల అధికారుల కార్యాలయాలకు స్కానర్లు, బ్రాడ్‌బాండ్‌ నెట్‌ కనెక్షన్లు ఇప్పంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సమాచార హక్కు చట్టం , సిటిజన్‌ సర్వీసు యాక్టులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నవంబర్‌ 30, 2014వరకు అందిన ఆర్జీలను పాత ప్రజావాణి ఇమెయిల్‌ ఐడిలో నమోదు చేయాలని, డిసెంబర్‌ 1,2014 నుండి కొత్త ప్రజావాణి ఇమెయిల్‌ ఐడిలో పొందుపూరచాలని కలెక్టర్‌ సూచించారు. హైకోర్టు కేసులకు సంబందించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, జాప్యం లేకుండా కౌంటర్లు సకాలంలో దాఖలు చేసేందుకు సంబందిత అధికారులు ప్రాధాన్యతనుర ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా నుంచి వివిద అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబందించిన ప్రభుత్వానికి మంజూరుకోసం పంపిన పెండింగ్‌ ఫైళ్ల వివరాల నివేదికలను ఈనెల 18న అందజేయాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రజావాణి ఆర్జీలను ఆన్‌లైన్‌లో నమోదుచేయడానికి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అడిషణల్‌ ఎస్పీ పాండునాయక్‌, డిఆర్‌ఓ మనోహర్‌, డిఆర్‌డిఎ పిడి వెంకటేశం బోధన్‌ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *