కావలసిన పదార్థాలు : ఉసిరికాయలు – 5, పాలు – 2 కప్పులు, చక్కెర – అర కప్పు, బాదం పప్పు – 10, జీడిపప్పు – 10, కిస్మిస్ – 5, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, తేనె – చిన్న కప్పు తయారు చేసే విధానం : ఉసిరికాయలను కడిగి.. ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత చిన్న, చిన్నముక్కలుగా కట్ చేసి తేనెలో వేసి గంటపాటు నానబెట్టాలి. కొన్ని వేడినీళ్ళల్లో జీడిపప్పు, బాదం పప్పును వేసి నానబెట్టాలి. ...
Read More »Daily Archives: December 18, 2014
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మాజీ మంత్రి
బోధన్, డిసెంబర్18: బోధన్ పట్టణంలోని పోస్టుఫీసు వద్ద గురువారం మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ ఎస్ ప్రభుత్వం అర్హలైన వారందరికి ఫీంచన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది అర్హలైన వారు ఉన్న పించన్లు అందలేదని తెలిపారు. ఫించన్లు అందకపోవడంతో వృద్దులు, వితంతువులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని తెలిపారు. అర్హలైన వారికి పించన్లు ఇవ్వకపోతే ఈనెల 20 మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ...
Read More »తాళం వేసిన ఇంట్లో చోరీ …. ఛైన్ స్నాచింగ్ – 2తులాల గొలుసుచోరీ
నిజామాబాద్ క్రైం, డిసెంబరు 18; నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో బుధవారం రాత్రి నాందేవ్‌వాడలోని విటల్ భూమయ్య అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి దొంగలు 4 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. విఠల్ భూమయ్య బుధవారం ఇంటికి తాళంవేసి బంధువుల పెళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి రాగానే ఇంటి తాళం పగులగొట్టి దొంగలు పడిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఛైన్ ...
Read More »సిఐడి వేట షురూ… కేసుల నమోదు…, అరెస్టులే తరువాయి ఏ1గా కృష్ణారెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి, డిసెంబరు 18; జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం ఇప్పుడు అక్రమార్కులకు వణుకు పుట్టిస్తుంది. విచారణ పూర్తి చేసిన సిబిసిఐడి వేట మొదలు పెట్టింది. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుంది. ముందస్తుగా కాంట్రాక్టర్ కృష్టారెడ్డిని ఎ-1 నిందితుడి కేసు నమోదు చేసి ఇందులో ముగ్గురు ఉద్యోగులు పేర్లు పెట్టింది. ఇప్పటికే వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బాగోతం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటికే 3 మందిపై ...
Read More »ఖతార్ ఉద్యోగాలకు ధరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ అర్భన్, డిసెంబరు 18; తెలంగాణా ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖతార్ దేశానికి ఫిట్టర్/ స్టీల్ ఫిట్టర్/ మార్కర్‌కు సంబందించిన 28ఖాళీలను భర్తీచేయుటకు స్క్రీనింగ్ పరీక్ష ఈనెల 23న హైదరాబాద్‌లో టామ్‌కాం ఆఫీసు ఐటిఐ మల్లెపల్లి క్యాంపస్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుందని జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి కనీస విద్యార్హత పదవ తరగతి పాసైన అభ్యర్తులు, 0 -2 సంవత్సరాల అనుభవం కలిగినవారు అర్హులని తెలిపారు. స్క్రీనింగ్‌పరీక్షకు అభ్యర్థులు ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉన్న ...
Read More »చట్టాల రక్షణకు ప్రమాణం చేయాలి… కలెక్టర్ రోనాల్డ్‌రాస్
నిజామాబాద్, డిసెంబర్ 19, వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అదనపు సంయుక్త కలెక్టర్ శేషాద్రి తెలిపారు. గురువారం స్థానిక నూతన అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, వ్యాపారస్తుల నుండి నాణ్యత లేని వస్తువుల, నకిలీ వస్తువులు పొందినపుడు చట్టపరంగా తన హక్కులను సాధించుకునేందుకు వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎంతగానో ఉపయోగకరిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు, యువత ఈ చట్టాల గురించిపూర్తిగా అవగాహన కల్పించుకోని సమాజంలో ప్రతి ఒక్కరిని ...
Read More »సోలార్ విద్యుత్ టెండర్ల త్వరగా పూర్తి చేయాలి
-మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి బోధన్, డిసెంబర్18: సోలార్ విద్యుత్ టెండర్లను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు కరెంటు కోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నరని తెలిపారు. విద్యుత్ కష్టలను తీర్చడానికి సోలార్ టెండర్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నరని తెలిపారు. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ...
Read More »మేట్రో పనులకు క్వారీ పరిశీలన
బాన్సువాడ, డిసెంబరు 18; హైదరాబాద్‌లోని మేట్రో రైలు పనులకు అవరసమగు ఇసుక గురించి స్థానికంగా ఉన్న ఇసుక క్వారీలను అధికారులు పరిశీలించారు. ఈ మేరకు బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బర్గంగెడిగి, శివారుల్లోని ఇసుక క్వారీలను పరిశీలించారు. ఇసుక నాణ్యతతో పాటు స్థానికంగా ఎవైన సమస్యలు తలేత్తుతాయా అని ఆరా తీసారు. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఖనిజ, గనుల శాఖ, రెవెన్యూ శాఖ, భూగర్భ జల శాఖ అధికారులు ఉన్నారు.
Read More »వైద్య కళాశాలకు మరో 50 సీట్లు… ప్రతిపాదనలు కోరిన డీఎంఈ
ఎంసీఐకీ నివేదిక నిజామాబాద్ ప్రతినిధి, డిసెంబరు 18; ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అదనంగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. దీనికి సంబందించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు నివేదికలను స్థానిక అధికారులు పంపించారు. ఈ నివేదికలపై ఎంసిఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల అధికారులు డీఎంఈకి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవలే మెడికల్ కళాశాలలో ఎంసీఐ బృందం మూడవ సంవత్సరం అనుమతి కోసం ...
Read More »28న పీవోడబ్ల్యూ జిల్లా మహాసభ
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 18; ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా 6వ మహాసభలను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నరమని, వాటిని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని గ్రామ చావిడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల పరిస్థితిపై సమావేశంలో చర్చించానున్నామని తెలిపారు.సినిమాలు,టీవీల్లో మహిళలను స్వార్దపరులుగా ,ద్వేషించే వ్యక్తులుగా చూపుతున్నారని,మాతృత్వానికి చిహ్నంగా ఉన్న మహిళలను విలన్లుగా మార్చడం శోచనీయమన్నారు. నిర్బయలాంటి ఎన్ని చట్టాలు చేసిన సమాజంలో నిత్యం మహిళలపై ఆకృత్యాలు జరు ...
Read More »ఇంటెలిజెన్స్ డిఎస్పీగా మనోహార్
నిజామాబాద్, డిసెంబరు 18; నిజామాబాద్ ఇంటెలిజెన్సి విభాగం డిఎస్పీగా కొత్తపల్లి మనోహార్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేట లో పని చేస్తున్న ఈయనను బదిలీపై నిజామాబాద్‌కు బదిలీ చేసారు. గతంలో కామారెడ్డి డీఎస్పీగా కూడా పని చేసారు. ఇది వరకే జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది.
Read More »డీపీసీ ఎన్నికలు పూర్తి… అంతా టిఆర్ఎస్ కైవసం
నిజామాబాద్, డిసెంబరు 18, జిల్లా ప్రణాళిక సంఘం(డీపీసీ) సభ్యుల ఎన్నిక ప్రశాతంగా ముగిసాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికల్లో తనసత్తాను చాటుకుంది. 24 స్థానాలకు ఎన్నికల జరుగగా 21 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. అధికార పార్టీ డీపీసీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో తిరుగు లేకుండా అయింది. 19 గ్రామీణ స్థానాలకు గానూ 18 స్థానాలకు టీఆర్ఎస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. 19 గ్రామీణ స్థానాలకు గానూ 22 మంది సభ్యులు నామినేషన్లు వేసారు. ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు నామినేషన్ల ఉపసహరించుకున్నారు. దీంతో ...
Read More »