Breaking News
ఆమ్లా ఖీర్

ఆమ్లా ఖీర్

కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు – 5, 
పాలు – 2 కప్పులు, 
చక్కెర – అర కప్పు,
 బాదం పప్పు – 10, 
జీడిపప్పు – 10, 
కిస్‌మిస్ – 5, 
యాలకుల పొడి – ఒక టీ స్పూన్, 
తేనె – చిన్న కప్పు

తయారు చేసే విధానం : 

  • ఉసిరికాయలను కడిగి.. ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత చిన్న, చిన్నముక్కలుగా కట్ చేసి తేనెలో వేసి గంటపాటు నానబెట్టాలి.
  • కొన్ని వేడినీళ్ళల్లో జీడిపప్పు, బాదం పప్పును వేసి నానబెట్టాలి. కాసేపటి తర్వాత వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  •  ఇప్పుడు పాలల్లో చక్కెర వేసి వేడిచేయాలి. దీంట్లో బాదం పేస్ట్‌ని వేసి మరగనివ్వాలి.
  • పాలు చిక్కగా అయ్యేంతవరకు అలాగే ఉంచాలి.
  • ఇప్పుడు తేనెలో నానబెట్టిన ఉసిరికాయ ముక్కలను, యాలకుల పొడిని వేసి సన్నని మంట మీద మరికాసేపు ఉండనివ్వాలి. అంతే.. తియ్య, తియ్యని ఆమ్లా ఖీర్ సిద్ధం!
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

62 అడుగుల జుట్టు!

ప్రత్యేకం: జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. మహిళలు కేశాలపై అమితమైన ప్రేమను చూపుతుంటారు. రకరకాలుగా అందమైన జడలు అల్లి ఆకట్టుకుంటారు. అంతేకాదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *