Breaking News
ప్రమాణం చేయిస్తున్న కలెక్టర్‌ రాస్‌

చట్టాల రక్షణకు ప్రమాణం చేయాలి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19,

వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అదనపు సంయుక్త కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. గురువారం స్థానిక నూతన అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ, వ్యాపారస్తుల నుండి నాణ్యత లేని వస్తువుల, నకిలీ వస్తువులు పొందినపుడు చట్టపరంగా తన హక్కులను సాధించుకునేందుకు వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎంతగానో ఉపయోగకరిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు, యువత ఈ చట్టాల గురించిపూర్తిగా అవగాహన కల్పించుకోని సమాజంలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయాలని ఆయన కోరారు.

తల్లి గర్భం నాటి నుండి కాలగర్భంలోకి వెళ్లేంతా వరకు అందరు వినియోగదారులని, వినియోగదారుల కేసుల పరిష్కారానికి ఈ రక్షణ చట్టం ఏర్పడిందని, భారత పార్లమెంట్‌ వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని 1986లో ఆమోదించిందని, దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర 24 డిసెంబరు 1986 నాడు లభించినందున ప్రతి సంవత్సరం డిసెంబరు 24వ తేదిన జాతీయ వినియోగదారుల దినోత్సవంగా పాటిస్తున్నామని అన్నారు.

వినియోగదారుల రక్షణ చట్టం గురించి పెద్దలు తెలుసుకునే బదులు నేడు పిల్లలైన మీరు వినియోగ రక్షణ చట్టంపై ర్యాలీలో పాల్గోని ప్రచారం నిర్వహించడం అనందదాయకమైన మీమ్ములను ఇబ్బంది కలిగించడం బాధకలుగుతుంది.

ప్రస్తుతం ఈ చట్టం గురించి మీరు తెలుసుకుంటే మీ నుండి పెద్దవారు తెలుసుకుంటారని అన్నారు. ఆహర ధాన్యాలను, వస్త్రాలను కోన్నప్పుడు నాణ్యమైన వస్తువులనే కోనాలని అన్నారు.

వస్తువు కోనే సమయంలో తప్పనిసరిగా బీల్లు తీసుకోవాలని సూచించారు. మనం కోన్న వస్తువులలో ఎవైనా లోపాలు ఉన్నచో జిల్లాలో గల వినియోగదారుల ఫోరంలో దరఖాస్తు సమర్పించి కేసు నమోదు చేయాలని అన్నారు.

ఈ చట్టంలోని ప్రాదికరణాలన్ని సహజంగా నష్ట పరిహారానికి సంబంధించినవి అని తెలుసుకునేందుకు జిల్లాలో వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని, మనకు నష్టం, హని కలిగించే వస్తువులు అమ్మిన వారిపై జిల్లాలో 10 రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి పరిష్కరించుకోవచ్చన్నారు.

రూ.20 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నచో రాష్ట్ర స్థాయిలో గల కమిషనర్‌ గారికి దరఖాస్తు చేసుకోని లబ్దిపోందవచ్చని, అంతేగాక కోటి రూపాయల వరకు వస్తువు కాని, స్థలాన్ని కాని కోన్న తరువాత వాటిలో ఎవైనా లోపం ఉన్నదని తెలిసిన మరుక్షణమే జాతీయ స్థాయిలో గల కమీషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రతి వ్యక్తి హక్కులతో పాటు బాధ్యతలు కలిగి ఉండి జీవితాన్ని సరిదిద్దుకోవాలని అన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టరేట్‌ మైదానం నుండి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వినియోగదారుల సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్‌ గ్రౌండ్‌ నుండి గాంధీచౌక్‌ మీదుగా నూతన అంబేద్కర్‌ భవన్‌కు చేరుకుంది.

ఈ సమావేశంలో బోధన్‌ మెజిస్ట్రేట్‌ భరత్‌నగేష్‌, జిల్లా కన్జ్యుమర్‌ ఫెడరేషన్‌ అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, డిఎస్‌ఓ కోండల్‌రావు, సూర్యవంశీ వినియోగదారుల అధ్యక్షులు, రాందయనంద్‌, తదితరులు పాల్గోన్నారు.

Check Also

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *