Breaking News

తాళం వేసిన ఇంట్లో చోరీ …. ఛైన్‌ స్నాచింగ్‌ – 2తులాల గొలుసుచోరీ

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 18;

నిజామాబాద్‌ నగరంలోని 3వ టౌన్‌ పరిధిలో బుధవారం రాత్రి నాందేవ్‌వాడలోని విటల్‌ భూమయ్య అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి దొంగలు 4 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. విఠల్‌ భూమయ్య బుధవారం ఇంటికి తాళంవేసి బంధువుల పెళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి రాగానే ఇంటి తాళం పగులగొట్టి దొంగలు పడిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఛైన్‌ స్నాచింగ్‌ – 2తులాల గొలుసుచోరీ

నిజామాబాద్‌ నగరంలోని మాధవనగర్‌ రోడ్డుపై కల్యాణ మండపం సమీపంలో గురువారం చంద్రవ్వ అనే మహిళ పెళ్లికి వెళుతుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన దొంగలు ఆమెవద్దగల 2తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారని ఎస్‌హెచ్‌ఓ నరేశ్‌ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై నరేష్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *