Breaking News
ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌

డీపీసీ ఎన్నికలు పూర్తి… అంతా టిఆర్‌ఎస్‌ కైవసం

నిజామాబాద్‌, డిసెంబరు 18,

జిల్లా ప్రణాళిక సంఘం(డీపీసీ) సభ్యుల ఎన్నిక ప్రశాతంగా ముగిసాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో తనసత్తాను చాటుకుంది. 24 స్థానాలకు ఎన్నికల జరుగగా 21 స్థానాల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అధికార పార్టీ డీపీసీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో తిరుగు లేకుండా అయింది. 19 గ్రామీణ స్థానాలకు గానూ 18 స్థానాలకు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా ఎన్నిక అయింది.

19 గ్రామీణ స్థానాలకు గానూ 22 మంది సభ్యులు నామినేషన్లు వేసారు. ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యులు నామినేషన్ల ఉపసహరించుకున్నారు. దీంతో మిగిలిన స్థానాలకు ఏకగ్రీవం అయ్యాయి.

అలాగే పట్టణ స్థానాలు అయిదింటికి ఎన్నికలు జరగగా 84 ఓట్లతో విశాలిని రెడ్డి తెరాస కార్పొరేటర్‌, నిజామాబాద్‌. 65 ఓట్లతో మహమ్మద్‌షకీల్‌ అహ్మద్‌, కార్పోరేటర్‌ ఎంఐఎం, నిజామాబాద్‌. 72 ఓట్లతో లావణ్య, కాంగ్రెస్‌ కార్పోరేటర్‌, నిజామాబాద్‌. 51 ఓట్లతో భూమారెడ్డి తెరాస కౌన్సిలర్‌, కామారెడ్డి. 88 ఓట్లతో సుజాత తెరాస కౌన్సిలర్‌, ఆర్మూర్‌ గెలుపొందారు.

మొత్తం 141 ఓట్లకు గానూ 138 ఓట్లు పోలాయ్యాయి. ఈ ఎన్నికల నిర్వహణతో డీపీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.

Check Also

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *