Breaking News

28న పీవోడబ్ల్యూ జిల్లా మహాసభ

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 18;

ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా 6వ మహాసభలను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నరమని, వాటిని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని గ్రామ చావిడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల పరిస్థితిపై సమావేశంలో చర్చించానున్నామని తెలిపారు.సినిమాలు,టీవీల్లో మహిళలను స్వార్దపరులుగా ,ద్వేషించే వ్యక్తులుగా చూపుతున్నారని,మాతృత్వానికి చిహ్నంగా ఉన్న మహిళలను విలన్లుగా మార్చడం శోచనీయమన్నారు.

నిర్బయలాంటి ఎన్ని చట్టాలు చేసిన సమాజంలో నిత్యం మహిళలపై ఆకృత్యాలు జరు గుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పీవోడబ్ల్యూ రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై జిల్లా మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.

మహిళల అధికసంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో జిల్లా నాయకులు భాగ్య, నర్సక్క, నాగమణి, రమ, రేఖ తదితరులు పాల్లొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *