Breaking News

ఖతార్‌ ఉద్యోగాలకు ధరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 18;

తెలంగాణా ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖతార్‌ దేశానికి ఫిట్టర్‌/ స్టీల్‌ ఫిట్టర్‌/ మార్కర్‌కు సంబందించిన 28ఖాళీలను భర్తీచేయుటకు స్క్రీనింగ్‌ పరీక్ష ఈనెల 23న హైదరాబాద్‌లో టామ్‌కాం ఆఫీసు ఐటిఐ మల్లెపల్లి క్యాంపస్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుందని జనరల్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

దీనికి కనీస విద్యార్హత పదవ తరగతి పాసైన అభ్యర్తులు, 0 -2 సంవత్సరాల అనుభవం కలిగినవారు అర్హులని తెలిపారు. స్క్రీనింగ్‌పరీక్షకు అభ్యర్థులు ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్‌ పాస్‌పోర్టు తీసుకురావాలెనని తెలిపారు.

స్క్రీనింగ్‌ పరీక్షకు రెండు కలర్‌ పాస్‌ పోర్ట్‌సైజ్‌ ఫోటోలు తీసుకురావలసిందిగా జనరల్‌ మేనేజర్‌ (తెలంగాణా ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ , ఐటిఐ మల్లెపల్లి క్యాంపస్‌, విద్యానగర్‌, హైదరాబాద్‌) కోరారు.

అర్హులైన వారు ఈ క్రింది ఫోన్‌ నంబర్లకు సంప్రదించి వివరాలు తెలుసుకోవలసిందిగా సూచించారు. 998962451, 9247174143, 8886882125, 8886882127 నంబర్లకు ఫోన్‌లో ఇతర సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *