Breaking News

ఈనెల 24న 3వ ఇంటర్నేషనల్‌ ఫైడ్‌రేటింగ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 20;

నిజామాబాద్‌ నగరంలో ఈనెల 24 తేదీనుంచి రాఘవఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 3వ ఇంటర్నేషనల్‌ ఫైడ్‌ రేటింగ్‌ ఓపెన్‌ ఛెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ ఆర్గనైజింగ సెక్రెటరీ వి.శ్యాంసుందర్‌ తెలిపారు.

శుక్రవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ ఫైడ్‌ రేటింగ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ను తొలిసారిగా జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు మొదటిసారిగా దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి మేటి చెస్‌ క్రీడాకారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆసక్తిగలవారు తమ ఎంట్రీలను ఆన్‌లైన్‌ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసిందిగా తెలిపారు. ఈనెల 23లోగా తమ వివరాలతో పేర్లు నమోదు చేసుకోవలసివ ఉంటుందని తెలిపారు.

నిజామాబాద్‌ జిల్లానుంచి పాల్గొనే క్రీడాకారులకు 2వేల రూపాయల ఎంట్రీఫీజు ఉంటుందని ఆయన తెలిపారు. మిగతా ఎంట్రీ ఫీ ఇతర వివరాలకు ఫోన్‌ నం.09866966904, లేదా 040 40212821కు ఫోన్‌లో తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఈ పోటీలు స్థానిక ప్రగతినగర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 24న ప్లేయర్స్‌తో మీటింగ్‌ ఏర్పాటుచేసినట్లు ఆయనతెలిపారు. మీటింగ్‌లో క్రీడలషెడ్యూల నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 65వేలు, ద్వితీయ బహుమతి 45వేలు, తృతీయ బహుమతి 30వేలు, 4వ బహుమతి 15వేలు, 5వబహుమతి 10వేలతోపాటు ట్రోఫీ, 6వ బహుమతి 7వేలు, 7వ బహుమతి 6వేలు, 8,9, 10వ బహుమతి 5వేలు, అందించబడుతుందని తెలిపారు. అలాగే 25 బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. క్రీడాకారులందరికి భోజన వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా చెస్‌ క్రడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *