Breaking News

ఫీజు రియంబర్స్‌మెంట్‌కై ఆందోళన… వినూత్న నిరసనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌19:

ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం దేవిరోడ్డులో ఎబివిపి విద్యార్ధి నాయకులు బిక్షటన చేపట్టారు. ఈసందర్భంగా ఎబివిపి కన్వనార్‌ రాకేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన అరుమాసలు అవుతున ప్రభుత్వంలో చలనం లేదని, విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని అరోపించారు. విద్యార్ధులక అందే స్కాలర్‌షిప్‌లు విద్యార్ధులకు ఫీజురియంబర్స్‌ వివపక్షదోరణి అవలంభిస్తుందని విద్యార్ధులందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యార్ధుల సమస్యలు పరిష్కరం దిశగా పని చేస్తామని చెప్పిన కేసిఅర్‌ ఇప్పుడు మాటమారుస్తున్నారని అయన విమర్శించారు. విద్యార్ధులకే అందే 750 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియేడాల రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ అందోనలో గంగాధర్‌,మానిష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *