Breaking News

నగర సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20:

నగరంలోని కార్పొరేషన్‌ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కార్పొరేషన్‌ కార్యలయం ఎదటు సిపిఐ న్యూడెక్రసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ న్యూడెక్రసి నగర కార్యదర్శి పరుచూరి శ్రీధర్‌ మాట్లాడుతూ నగరంలోని అండర్‌డ్రైనేజి పనులు అన్ని ధ్వంసం చెందయని,కాని పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నయని అయన అరోపించారు. డివిజన్‌లోని పలు రోడ్లు బాగాలేక నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని, నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడల్సి వస్తుందని పేర్కొన్నారు. నగరంలోని అసరా పెన్షున్లలను అర్హులైయిన వారికి అందించాలని, నగరంలోని పార్కులు కబ్జాలకు గురివుతున్నయని వాటిని అభివృద్ది చేసి నగర ప్రజలకు వినియోగంలోకి తేవాలని తెలియజేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజలకు మౌళిక వసతులు కల్పించాలని కోరారు.ఈ ధర్నాలో పార్టీనాయకులు సత్యం పిడిఎస్‌ జిల్లా కార్యదర్శి అన్వేష్‌, సరిత, భాస్కర్‌, గోపాల్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *