Breaking News

తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘ నూతన జిల్లా కార్యవర్గం

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 21;

తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘ (టిపియుఎస్‌) ఇందూరు జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక ప్రగతినగ్‌లోని టిపియుఎస్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కీర్తిసుదర్శన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలేటి వెంకటరావు , రాష్ట్ర బాధ్యులు కర్నే శంకర్‌, గిరిజాగాయత్రి, యామ సత్యనారాయణ, రమేశ్‌గౌడ్‌ హాజరయ్యారు.

ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తెలంగాణా పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అందుకు తగినవిధంగా తమవంతు సహాయసహకారాలందించాలన్నారు. విద్యార్థులకు విద్యాబోధనలో ఉపాధ్యాయులు అత్యంత శ్రద్దాసక్తులతో బోధించాలన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు కల్పిస్తున్నశిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను సత్వరం పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులకు పిఆర్‌సి 63 శాతం ఫిట్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. అలాగే హెల్త్‌కార్డులు త్వరగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ సమావేశంల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లాఅధ్యక్షుడుగా కీర్తి సుదర్శన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మానెపు రవీంద్రనాథ్‌ ఆర్య, ఆర్థిక కార్యదర్శిగా అర్గుల సత్మం, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.రమేశ్‌కుమార్‌, కె.స్వరూపారాణి, నిర్మలాకుమారి, ఈమని సాయిప్రసాద్‌, రాఘవరెడ్డి, శివాజీ, జిల్లా కార్యదర్శులుగా భాస్కరాచారి, రమేశ్‌లాల్‌, జి.రవీందర్‌, శ్రీకాంత్‌, లక్ష్మీపతి, శోభన్‌బాబు, జిల్లా కార్వర్గసభ్యులుగా పి.గోపీనాథ్‌, వేదప్రకాశ్‌, ఎం.నారాయణ, రాంచందర్‌, లక్ష్మణ్‌రావు, అరుంధతి, జిల్లా మహిళా నాయకురాలు ఇ.నీలవేణి, కోకన్వీనర్‌గా సునీతా,అకాడమిక్‌ కమిటీ కొంతం వెంకటేశం, సుభాష్‌, జిల్లా పేవా ప్రముఖ్‌ దత్తాచారి, సహసేవా ప్రముఖ్‌ నరోత్తం, ప్రెస్‌ ఇన్‌ఛార్జి సుదర్శన్‌గౌడ్‌, ఆడిట్‌ కమిటీ ఛైర్మన్‌ దేవీసింగ్‌, కోఛైర్మన్‌ ఎం.హన్మాండ్లు, సాంకేతిక ప్రముఖ్‌ రుద్రమధుసూదన్‌, డివిజన్‌ కార్యదర్శులు విఠల్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, ప్రభాకర్‌, గంగాప్రసాద్‌, లచ్చయ్య, సోమయ్యచారి, గిరి బిఎన్‌. సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా ఆంజనేయులు, జిల్లా కార్యలయ ఇన్‌ఛార్జిగా బైస లక్ష్మీనారాయణలను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఆయా మండలాలనుంచి ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో సంఘ విస్తరణకు తమతమసహకారమందిస్తామని సభ్యులు తెలిపారు.

Check Also

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *