Breaking News

భీమా అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 22;

పంటల బీమా పథకంలో రుణం పొందిన రైతులు రబీ 2014- 15 సీజన్‌లో ప్రపొజల్స్‌తో సహాప్రీమియం చెల్లింపునకు తుది గడువు ఈనెల 31లోగా చెల్లించాలని సంయుక్త వ్యవసాయ సంచాలకులు నర్సింహా తెలిపారు. జిల్లా రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన సూచించారు. బ్యాంకు నుండి రుణం పొందు రైతులు ప్రీమియంను బ్యాంకులోనే చెల్లించాలని, రుణం పొందని రైతులు ఐశ్చికంగా వారివారి పరిధిలోని ఏదేని బాంకులో అకౌంట్‌ తెరిచి ప్రపోజల్‌ ఫారంతో సహ సాగు చేయబడిన పంటలు, వాటి విస్తీర్ణం తదితర వివరాలతో కూడిన ధృవీకరణ పత్రం సంబందిత గ్రామపంచాయతీ రెవెన్యూ అధికారితో తస్తీకు చేయించి సంబందిత బ్యాంకు అధికారులకు సమర్పించి, పైన తెలిపిన నోటిఫైడ్‌ చేసిన పంటలకు మాత్రమే ప్రీమియంను సకాలంలోచెల్లించాలని ఆయన సూచించారు. గడువు తర్వాత చేసే ప్రీమియంను తిరస్కరించడంజరుగతుందని ఆయన తెలిపారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *