Breaking News

అంగన్‌’వాడీ’… మెరిట్‌ ‘పరీక్ష’… గ్రేడింగ్‌ విధానం అమలు పనితీరుకు పరీక్ష…

నిజామాబాద్‌, డిసెంబరు 22;

పసిపాపల అలన పాలన చూసే అంగన్‌వాడిలకు ఇక నుంచి మెరిట్‌ పరీక్షలు అమలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్‌ రాస్‌ నిర్ణయం మేరకు అంగన్‌వాడిల పని తీరును మెరుగు పరచేందుకు గ్రెడింగ్‌ విదనాన్ని అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విదానం జిల్లాలో ప్రదమంగా మొదలు కావడం విశేషం. దీనిపై అంగన్‌వాడి వర్కర్ల సంఘం ప్రతినిషధులు వ్యతిరేకరిస్తున్నాయి. ఇచ్చే ఆరాకోరా వేతనాలను అడ్డం పెట్టుకొని అధికారులు అంగన్‌వాడి టీచర్లను, అయాలను మరింత వేధింపులకు గురి చేస్తారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పర్యవేక్షణ అధికారుల వేధింపులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కుట్రలు కుతంత్రాలతో తీవ్ర ఇబ్బందులున్నాయంటు సంఘ ప్రతినిధులు అంటున్నారు. ఇంతకు ఈ గ్రెడింగ్‌ విధానం ఏలా అమలు చేస్తారనేది, అందుకు తగిన నిబంధనాలను ఖరారు చేస్తున్నారు.

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరించేందుకు కొత్త విధానం అమలు చేయనున్నారు. నిర్వహించే పరీక్ష ఆధారంగా వచ్చిన మార్కుల ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లను కేటాయిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్‌ విద్యార్థులు, గర్బిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహరం అందేలా ఈ గ్రేడింగ్‌ విధానానికి కలేక్టర్‌ శ్రీకారం చుట్టారు. ఈ విషయమై వారం రోజుల క్రితం ప్రత్యేకంగా ప్రాజెక్టు సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లతో సమావేశం నిర్వహించి చర్చించారు. గ్రేడింగ్‌కు సంబంధించిన ఫార్మాట్‌ను తయారు చేయాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పది పర్యవేక్షణ కేంద్రాల పరిధిలో 2,711 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ప్రాజెక్టుల్లో అమ్మ హస్తం పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

గ్రెడింగ్‌ విధానం…

అంగన్‌వాడి కేంద్రాల్లో నిర్వహకులకు 14 అంశాలతో కూడిన ఫార్మాట్‌ను తయారు చేసారు. ఈ ఆంశాల వారికి ఒకోక ఆంశానికి కొన్ని మార్కులు కెటాయించారు. వీటిలో నిర్వహకురాలకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రెడింగ్‌ ఇస్తారు. వివరాలు…

నెలసరి హజరుకు 10 మార్కులు. పిల్లల సంఖ్య తగ్గకుండా చూడటం, వారి హజరు వంద శాతం ఉండేలా చూడటం 10 మార్కులు. పిల్లలకు బోధన, వారి తీరుకు 10 మార్కులు. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను పాఠశాలల్లో చెర్పించడం 5 మార్కులు.

పిల్లలకు పద్దతులు నేర్పించి, ఐదు అంశాల క్యాలేండర్‌ను వివరించడం 5 మార్కులు.

ప్రతి గర్బిణిని 10 కేజీల బరువు పెంచితే 5 మార్కులు. వారికి ఐరన్‌ మాత్రలు పూర్తిస్థాయిలో అందిస్తే 5 మార్కులు. పౌషికాహరంతో పుట్టిన పిల్లవాడు 2.8 కేజీలు పుడితే 5 మార్కులు. పుట్టిన పిల్లవాడికి సంవత్సర టీకాలు ఇప్పిస్తే 10 మార్కులు. మాతా, శిశు మరణాలు తగ్గించినందుకు 5 మార్కులు. తీవ్రలోప, అతి తీవ్ర లోప పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహరం అందిస్తే 10 మార్కులు. అంగన్‌వాడి కేంద్రానికి సంబంధించిన 11 రిజిష్ట్రర్లను సరిగ్గా నిర్వహిస్తే 10 మార్కులు. అంగన్‌వాడీ కేంద్రాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే 5 మార్కులు. బాల్య వివాహలు నిలిపివేసినందుకు 5 మార్కులు. మార్కుల ఆధారంగా ప్రోత్సహాకాలు అందిస్తారు.

Check Also

ప్రభుత్వ పథకాల నిధులు క్రింది స్థాయికి చేరే విధంగా కషి చేద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదల చేసే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *