Breaking News

పుష్కర ఘాట్‌ను సందర్శించిన బోధన్‌ ఆర్డీఓ

బోధన్‌, డిసెంబర్‌ 22

కందకుర్తి త్రివేణి సంగమం పుష్కరఘాట్‌ను సోమవారం బోధన్‌ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్‌ సందర్శించారు. వచ్చే సంవత్సరం జూలైలో జరగబోయే పుష్కరాల కోసం వచ్చే భక్తులకు చేపట్టవలసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్‌వద్ద భక్తులకు అవసరమైన గదులు, కాలినడకన వచ్చే వారికి సౌకర్యంగా రోడ్డు నిర్మాణపనులు సత్వరం పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల సమయం సమీపిస్తుండడంతో భక్తులకు అన్ని వసతి సౌకర్యాలు, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయనతోపాటు రెంజల్‌ ఎంపిడిఓ మోబిల్‌ఖాన్‌ , సర్పంచు ఖలీంబేగ్‌ ఉన్నారు.

——-

దళితులకు వెంటనే మూడెకరాల భూమి పంపిణీ చేయాలి

బోధన్‌ , డిసెంబర్‌ 22

దళితులకు మూడెకరాల భూమి వెంటనే పంపిణీ చేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్ముల గంగాధర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారందళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా కూడా ఇప్పటికీ పంపిణీచేయడంలేదని ఆరోపించారు. కేసిఆర్‌ ఎన్నికల హామీని ఇకనైనా నిలబెట్టుకోవాలని కోరారు. దళితులకు సత్వరం మూడెకరాల భూమి అందించాలని కోరుతూ వారు తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ ధర్నాలో బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి ఎల్‌.గంగాధర్‌, మండల దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

సౌరశక్తితో నడిచే స్కూటర్ తయారీ

విజ్ఞాన్ ఇంజినీరింగ్ ఈఈఈ విద్యార్థుల ప్రతిభ భూదాన్ పోచంపల్లి : మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *