Breaking News

అదిగో చిరుత… ఇదిగో జాడ వృద్ధి చెందుతున్న సంతతి

బాన్సువాడ, డిసెంబర్‌,22 .

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కాదు ఇది నిఖార్సయిన నిజం. కాకతీయుల కాలం నాటీ కౌలాస్‌ కోటలో చిరుతలు సంచరిస్తున్న ఆనవాళ్ళు స్పష్టమవుతున్నాయి. జిల్లా తోపాటు పోరుగునే ఉన్న మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుంచి వలసవచ్చిన వాటిలో ఈ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగింది.

బోధన్‌, కామారెడ్డి డివిజన్‌ల అటవీ క్షేత్రాల పరిధిలో దశాబ్దకాలంగా చిరుతల సంతతి వృద్ది చేందుతోంది. దట్టమైన అడవులు విస్తరించి ఉండటంతో పాటు జీవనీనికి అనువుగా మారుతోంది పోరుగునా మహరాష్ట్ర, కార్ణటక ప్రాంతాలు మొదలు కోని తెలంగాణలోని మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలకు నిజామాబాద్‌ జిల్లా అడవులు విస్తరించి ఉన్నయి. ఒక్క బాన్సువాడ అటవీ క్షేత్ర పరిధిలోనే 30 వేల హెక్టార్లు అటవి భూమి ఉన్నట్లు రికార్టులు చేబుతున్నాయి. దశాబ్దకాలంగా ఇక్కడి అడవుల్లో చిరుతల సంచరాం పెరుగుతు వస్తోంది. ముఖ్యంగా బాన్సువాడ, వార్ని, కౌలస్‌ పిట్లం, నిజాంసాగర్‌ బిచ్కుంద, ఎల్లారెడ్డి అటవి ప్రాంతల్లో తరుచుగా విటీ ఉనికి వెల్లడవుతోంది. దట్టమైన అటవి ప్రాంతలోనున్న జుక్కల్‌ మండలం కౌలాస్‌ కోటలో చిరుతాలు విడిదిచేస్తున్నయి.

ఇదగో ఆనవాళ్ళు

మానవుల అటవీక చర్యలు వణ్యప్రాణులకు సంకటంగా మారుతున్నాయి. కలప, సాగుభూముల కోసం అడవులను అడ్డూ అదుపువేకుందా నరికి వేస్తున్నారు. దీంతో అడవులు కుంచించుకుపోతున్నాయి. వృక్ష సంపద తరిగిపోయి పలుచబడుతున్నాయి. వన్యప్రాణుల మనగడకు ముప్పుపాటిల్లుతోంది. దీంతో అడవుల్లో నివాసించాల్సినా ప్రాణులు పలుసార్లు జనవాసాలకు చేరువగా వస్తున్నాయి. బాన్సువాడ ప్రాంతంలో చిరుతలు తరుచుగా పెంపుడు జంతువులపై దాడులు చేస్తున్నాయి. మనుషులను చంపిన సంఘటనలు ఉన్నాయి. బిచ్కుంద మండలం శాంతాపూర్‌, పెద్ద కాడ్పుగల్‌, పిట్లం మండలం చిల్లర్గి నిజాంసాగర్‌ మండలం వడ్డేపల్లి, బాన్సువాడ మండలం కోనాపూర్‌, హన్మాజీపేట, సంగోజిపేట, వర్ని మండలం బడాపహడ్‌, జలాల్‌పూర్‌, చింకుంట ప్రాంతల్లో మేకల మందలపై దాడులు చేశాయి.

బిచ్కుంద మండలం పెద్ద కాడ్పుగవ్‌ శివారులో ఏడాది కిందట పంటచేనుకు కాపలాగ ఉన్న ఓ వృద్దున్ని చిరుత దాడిచేసి చంపింది. జుక్కల్‌ మండలం గుండూరు శివారులోనూ పలువురిపై చిరుతలు దాడిచేసి గాయపరిచాయి. ఇటీవల కామారెడ్డి డివిజన్‌లో ఒ చిరుత సంచారం ప్రజలను భయందోళనలకు గురిచేసింది.

ప్రాణాలకు ముప్పు

మేకల పెంపకం దారులు, చిరుతల ప్రాణాలకు ముప్పుకలిగిస్తున్నారు. శాంతాపూర్‌ అటవీ ప్రాంతాంలో గడ మేకల పేంపకం దారులు విషాహరం ఎరగావేయడంతో ఓ చిరుతమృతి చేందింది. అటవీ ప్రాంతాంలో జంతులబారినుండి పంటలను కాపాడేందుకు రైతులు ఇనుపతీగలతో కంచేవేసి రాతుళ్ళలో విద్యుత్‌ కనెక్షన్‌ అమర్చుతున్నారు. ఇది చిరుతల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పిట్లం. నిజాంసాగర్‌ మండలల్లో విద్యుత్‌ కంచేలతో రెండు చిరుతలు మృతి చేందిన సంఘటనలున్నాయి.

వృద్దిచేందుతున్న సంతతి

బాన్సువాడ అటవీ క్షేత్ర పరిధిలో ఐదారేళ్ళుగా చిరుతలు సంతతి వృద్ది చేందుతుంది. ప్రవియేటా పోటీ గణన కోనసాగుతోంది. పాదముద్రల ఆధారంగా వీటీని వెక్కిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఐదారు చిరుతలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Check Also

సహకార బ్యాంకును తనిఖీ చేసిన పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *