Breaking News

డీఎంహెచ్‌వో బదిలీ…? అధికారిక ఆదేశాలు తరువాయి… మింగుపడని అధికారి తీరు

నిజామాబాద్‌, డిసెంబరు 22;

అది జిల్లాలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ. దీని వారథి గోవింద్‌ వాగ్మారే. ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించారు. అది నుంచి ఈయన అ శాఖలో వివాదస్పదంగా వ్యవహారిస్తుండటం. ఈ తరహాలోనే పని చేసిన నగర పాలక కమిషనర్‌ మంగతయారును సరెండర్‌ చేయడం, అదే కోవలో వాగ్మారే బదిలీ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాని ఈయన బదిలీ ఇప్పుడు తప్పనిసరి అని అటు అధికారవర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

కారణాలు ఏంటీ.?

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్వయనా డీప్యూటీ సిఎం రాజయ్య జిల్లా పర్యటనకు వస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వాగ్మారే మాత్రమే న్యాయస్థానం పని అంటు హైదరాబాద్‌లో ఉండటం మొదట వివాదానికి దారి తీసింది. సాక్షాత్తు మంత్రి వస్తే జిల్లాను వదిలి వేళ్లడం ఏమిటని ప్రజా ప్రతినిధులు పెదవి కోరుకున్నారు. డిఎం అండ్‌ హెచ్‌వో గురించి చర్చకు వచ్చినప్పుడు జిల్లాకు చెందిన శాసన సభ్యులు అంతా ముక్తకంఠంతో వ్యతిరేకంగా సమాధానం చెప్పారు. దీంతో అదే రోజు వాగ్మారే బదిలీకి బీజం పడింది.

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం అది. వైద్య శాఖ పని తీరుపై చర్చ జరుగుతుంది. అ చర్చల్లో జుక్కల్‌, బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయం అందడం లేదని సభ్యులు ఆరోపణలు చేసారు. దీనికి వాగ్మారేనే కారణమని, శాఖలో అవినీతి పెచ్చుమీరడంతోనే ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేదని ఆరోపించారు. దీనిపై జిల్లా వైద్యాధికారి వాగ్మారే సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వాగ్మారేను బదిలీ చేయాలని కలెక్టర్‌కు సిఫారసు చేసారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సలలహా మండలి సమావేశంలో సదరన్‌ క్యాంపులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై డిఎం అండ్‌ హెచ్‌వో సమాధానం చెప్పకపోగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని రుడి అయింది. దీంతో అగ్రహించిన కలెక్టర్‌ పని చేయలేకపోతే సెలవుపై వెళ్లాలని లేదా బదిలీ చేయించుకోవాలని హెచ్చరించారు.

ఇలా లెక్కకు మించిన సమస్యలు, అధికారి తీరు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మింగుడు పడటం లేదు. దీంతో బదిలీ ఖాయమనే, అధికారిక ఆదేశాలు వెలువడమే తరువాయిగా మిగిలింది.

Check Also

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *