Breaking News

గాడిలో పడేనా..? నగర పాలనపై మల్లాగుల్లాలు… ఆర్డీవోకు కార్పొరేషన్‌ కమిషనర్‌ బాధ్యతలు

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 22;

నిజామాబాద్‌ నగర పాలన వ్యవస్థ ఇకనైనా గాడిలో పడుతుందా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకు ఇంచార్జి కమిషనర్‌గా వ్యవహారించిన మంగతాయరు అధికారిక, సంక్షేమ పథకాల అమలులో ఇష్ట రాజ్యంగా వ్యవహారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అధికారిక చర్యలకు దిగడంతో ఆమె సెలవుపై వెళ్లిపోయారు. దీంతో నిజామాబాద్‌ అర్‌ డివో యాదిరెడ్డికి ఇంచార్జి కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈయన బాధ్యతలు స్వీకరించడంతో ఇకనైనా నగర పాలక వ్యవస్థ గాడిలో పడుతుందా అనే ఆశలు వ్యక్తం అవుతున్నాయి.

నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌గా రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చారు.

జూలై 2013లో కమిషనర్‌గా పని చేస్తున్న రామకృష్ణరావు బదిలీ కావడంతో ఈమెకు ఇంచార్జి కమిషనర్‌కు బాధ్యతలను అప్పగించారు. మొదటి నుంచి ఆమె పనితీరు వివాదస్పదంగానే సాగింది. మున్సిపల్‌ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు వ్యక్తిగత వ్యవహారాలుగానే పాలన వ్యవస్థను చూడటం, అధికారులపై, ప్రజా ప్రతినిధులపై ఇష్టారాజ్యంగా వ్యవహారించడంతో రాజకీయ జోక్యం కూడా తప్పలేదు.

కొత్త పాలక వర్గం కొలువు తీరాక కూడా ఏలాంటి మార్పు రాలేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్షన్ల పథకం అమలులోనూ నిర్లక్ష్యంగా వ్యవహారించగా 4000లకు పైగా లబ్దిదారులకు ఆసరా సహకారం అందలేదు. ఇది ఏకంగా అటు పాలనా యంత్రాంగానికి, ఇటు ప్రజా ప్రతినిధుల అగ్రహానికి గురికాకతప్పలేదు. దీంతో తప్పనిసరి అయి ఆమె కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు ప్రభుత్వానికి సరెండర్‌ చేసారు.

అంతా కొత్త… సమస్యల సంతా…

నిజామాబాద్‌ నగర పాలక సంస్థ తీరు పాలన వ్యవహారం అంతా కొత్తగానూ, సమస్యల సంతాగా తయారు అయింది. కొత్త పాలక వర్గం కొలువు తీరినా ఇప్పుడు ఉన్న సభ్యులు మెజారిటీ కొత్తవారే కావడంతో పాలన వ్యవహారంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల జరిగిన నగర పాలన సర్వ సభ్య సమావేశంలో సభ్యుల తీరుకు జిల్లా కలెక్టర్‌ విస్తుపోవడమే కాకుండా ఒక గంట పాటు ఉపాధ్యాయుడిగా మారి పాలన తీరు, సమావేశంలో సభ్యుల పని తీరుపై వివరణ ఇచ్చారు. దీనికి తోడు మహిళ, పురుషుల కార్పోరేటర్లకు వేరు వేరుగా శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ తరుణంలో నగర పాలన సంస్థకు ఇంచార్జి కమిషనర్‌గా ఆర్‌డివో యాదిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతోపైనా కొంతైనా మార్పు జరుగుతుందా అనే చర్చ వినిపిస్తుంది. మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందో….?

Check Also

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *