Breaking News

నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాస్తారోకో రోడ్డె ఎక్కిన విద్యార్థినిలు

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 22;

నిజామాబాద్‌ నగరంలో మూడు రోజుల వినాయక్‌నగర్‌కు చెందిన వివాహిత సరిత హత్యకు కారకులైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మహిళా కళాశాలకు చెందిన ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలు ఆందోళనకలిగిస్తున్నాయని, అంతేగాక పట్టణాలు, నగరాలనే తేడాలేకుండా ఈవ్‌ టీజింగ్‌ పెరిగిపోయిందని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినీలు,బాలికలకు సైతం భద్రత లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా విద్యార్థినీలు నిందితునికి సత్వరం శిక్షపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని నగరంలో పలు రోడ్ల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. విద్యార్థినీలతోపాటు పిడిఎస్‌యు కార్యకర్తలు వారికి మద్ధతుగా ర్యాలీలో పాల్గొని సరిత హత్యకు నిరసనగా నినాదాలుచేస్తూ అత్యంత కిరాతకంగా హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. ఈసందర్భంగా కళాశాలకు చెందిన పలువురు విద్యార్థినీలతోపాటు పలువురు సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *