Breaking News

23 నుంచి రాష్ట్రస్థాయి థంగ్‌సుడో కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 22;

స్కూల్‌గేమ్‌ ఫెడరేషన్‌ అండర్‌-14,17,19 విభాగంలో రాష్ట్రస్థాయి తంగ్‌సుడో క్రీడాలు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. డీఎస్‌ఏ స్టేడియంలోని నిర్వహిస్తామన్నారు. జూనియర్‌ కళాశాలల నిర్వహణ కార్యదర్శి డి.సాయిలు,పాఠశాలల నిర్వహణ కార్యదర్శి జీవీ భూమారెడ్డి పర్యవేక్షణలో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తారు. ఈ మేరకు అ క్రీడ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్‌ సావన్‌ఆలా, పంపరి ప్రవీణ్‌కుమార్‌లు తెలిపారు.

23న జిల్లాస్థాయి బాలబికలకు పోటీలు….

23న మొదటి రోజు జిల్లాస్థాయి బాలబాలికలకు పోటీలు, 24న రాష్ట్రస్థాయి జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల విధ్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కళాశాల, పాఠశాలల్లో చదువుతూ కరాటేలో అర్హతలు ఉన్న క్రీడాకారులు నేరుగా జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. 24న నిర్వహించే ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గోనే క్రీడాకారులు తమ ఎంట్రీలను నమోదు చేసుకునేందుకు 984881065 నెంబర్‌కు ఫోన్‌ చేసి నమోదు చేసుకోవచ్చాన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు.

Check Also

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *