Breaking News

పుష్కరాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలి… సీఎస్‌ రాజీవ్‌శర్మ

నిజామాబాద్‌, డిసెంబరు 22;

రాబోయే గోదావరి పుష్కరాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లాయంత్రాంగం తరఫున అవసరమయ్యే ఏర్పాట్లన్నీ సత్వరం పూర్తిచేయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాకలెక్టర్‌కు సూచించారు. సోమవారం సచివాలయం నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ ,ఖమ్మం జిల్లాలలోని కలెక్టర్లతో అధికారులతోవీడియో కాన్ఫరెన్సు ద్వార ఆయా జిల్లాల్లో గోదావరి పుష్కరాల కోసం అధికారులు రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్లతోసమీక్షించారు. పుష్కరాల సందర్భంగా అతి ముఖ్యమైన వ్యక్తులు హాజరవుతారని, వారికి ఇబ్బంది కలగకుండా విడిది కోసం అవసరమైన రోడ్లు, భవనాలు,పంచాయతీరాజ్‌, టూరిజం తదితర వసతి గృహాలన్ని మరమ్మతులు జరిపి తగిన వసతి కల్పించడానికి చేపట్టవలసిన పనులకు సంబందించి బడ్జెట్‌ అంచనాలతో మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పుష్కర కార్యక్రమాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాకలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ మాట్లాడుతూ జిల్లాలోని 11 ప్రాంతాలకు సంబందించిన 18 పుష్కరఘాట్లు ఏర్పాటుచేయాలని సంకల్పించినట్లు తెలిపారు. పుష్కర ఘాట్ల వద్దకు స్వయంగా వెళ్లి రోడ్లను, ఘాట్లను పరిశీలించినట్లు, ఇప్పటికే వివిధ అభివృద్ది పనులకు 65 కోట్ల ప్రతిపాదనలు అధికారులు రూపొందించారని, అన్ని ప్రతిపాదనలు శాఖ వారీగా పరిశీలించి మరో దఫా, మిగలిన పుష్కరఘాట్ల ప్రాంతాల్లోపర్యటించి నివేదికను రూపొందిస్తామని కలెక్టర్‌ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో దేవాదాయశాఖ ప్రధానకార్యదర్శి వినోద్‌ అగర్వాల్‌, ప్రభుత్వ సాంకేతిక సలహాదారు రమణాచారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *