ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ మృతి

ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ్ఠగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1930 జులై 9న జన్మించిన ఆయన పూర్తి పేరు కైలాసం బాలచందర్‌. ‘నీర్‌ కుమిళి’ (1965)తో దర్శకుడైన బాలచందర్‌ తెలుగులో ఆయన తొలి చిత్రం ‘భలే కోడలు’, ‘అంతులేని కథ’తో తెలువారి మదిని దోచుకున్నారు. అలాగే బాలచందర్‌ తొలి తెలుగు స్టయిల్‌ చిత్రం ‘మరో చరిత్ర’. ప్రఖ్యాత నటులు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లను తీర్చిదిద్దిన బాలచందర్‌ తన చిత్రాల ద్వారా ఎందరికో జీవితం ప్రసాదించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శక, నిర్మాతలు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 

వైవిధ్యానికి పెద్దపీట వేయడంలో దిగ్దర్శకుడు కె.బాలచందర్ బాణీయే వేరు… పాతకథనైనా కొత్త పంథాలో చెప్పగల నేర్పు ఆయన సొంతం… అందుకే ఆయనంటే ఈ తరం వారికీ ఓ ప్రత్యేకమైన అభిమానం. మన చుట్టూ ఉన్న పాత్రలనే పట్టుకువచ్చి మన ముందుంచి మురిపించడంలో సిద్ధహస్తుడు కె.బాలచందర్… తమిళనాట పుట్టిపెరిగినా, తెలుగుభాషన్నా, తెలుగుసాహిత్యమన్నా, తెలుగునేలన్నాఆయనకు ఎంతో అభిమానం… భాషరాకున్నా తెలుగునేలతో బాలచందర్ బంధం మాత్రం అపురూపమైనది. తెలుగులో బాలచందర్ తొలి చిత్రం ‘భలే కోడలు’… ఆరంభంలో నటనిర్మాత చలం ప్రోత్సాహంతో తెలుగులో రాణించారు.

బాలచందర్ కథలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. వాటిలో వ్యాపార విలువలనూ అందంగా చొప్పించగల నేర్పు ఆయన సొంతం… అందుకే బాలచందర్ సమకాలీన దర్శకులు సైతం ఆయనకు అసిస్టెంట్ గా పనిచేసినా ఎంతో నేర్చుకోవచ్చునని కితాబునిచ్చారు… వైవిధ్యమైన తన చిత్రాల ద్వారా ఎందరో నటీనటులకు సినీజీవితం ప్రసాదించిన ఘనుడాయన! ముఖ్యంగా బాలచందర్ చిత్రాల ద్వారానే కమల్ హాసన్ నటుడిగా ఒక్కో మెట్టు పైకెక్కారు… ఇక రజనీకాంత్ కు ఆ పేరు పెట్టి నటుణ్ని చేసిందే ఆయన.తెలుగునేలపై ఎన్నో అందాలున్నాయని, ముఖ్యంగా మన వైజాగ్ అందాన్ని మనకే ఆశ్చర్యం కలిగేలా చూపించిన స్వాప్నికుడు బాలచందర్!… ఆయన భావుకత దక్షిణాదినే కాకుండా హిందీ చిత్రాల ద్వారా ఉత్తరాదిన కూడా జేజేలు అందుకుంది.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

‘కాలుతోందా మీకు..’ విజయ్ దేవరకొండ కామెంట్స్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడో సెన్సేషనల్. అర్జున్‌రెడ్డి సినిమాపై విమర్శలు చేసిన వీహెచ్‌ను ‘తాతా చిల్’.. అన్నా.. సెన్సార్ టీంను ...

Comment on the article