Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న అరికెల నర్సారెడ్డి.

క్రియాశీల సభ్యత్వంతో జిల్లాలో టిడిపి బలోపేతం

 

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23

నిజామాబాద్‌ జిల్లాలో టిడిపి క్రియాశీల సభ్యత్వానికి మంచి స్పందన లభించిందని ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. మంగళవారం టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు వెన్నంటి ఉంటూ పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. తెలంగాణా పది జిల్లాల్లో క్రీయాశీల కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్లలేదని, అన్నివేళలా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు.

జిల్లాలో కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా బీమా పథకాన్ని వర్తింపచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ బీమా పథకం ద్వారా పార్టీలో చేరిన సభ్యులందరికి 2లక్షల బీమాతో పాటు కార్పొరేట్‌ వైద్యసేవలు సైతం అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్డు ద్వారా కార్పొరేట్‌ వైద్యశాలల్లో 15శాతం ఫీజు రాయితీ లభిస్తుందన్నారు. పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తలందరికి అందించాలనే ఆలోచనతో తాము జిల్లా అంతటా సభ్యత్వాలు చేపట్టామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 25,110 మంది క్రియాశీల సభ్యులు పార్టీలో సభ్యత్వం తీసుకున్నారని, అలాగే 75వేల సాధారణ సభ్యత్వం తీసుకున్నారని ఆయన చెప్పారు. వచ్చే జనవరి 1నుంచి పార్టీ ఆధ్వర్యంలో ఈ బీమా పథకం సభ్యత్వం తీసుకున్న వారందరికి అమలవుతుందన్నారు. జిల్లాలో రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వ్యవసాయ సాగుకు అవసరమైన కరెంటు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా రైతులకు కనీసం 5గంటలైనా కరెంటు ఇస్తారన్న నమ్మకం లేదని విమర్శించారు. సాధారణ ప్రజల స్థానిక సమస్యలనైనా ప్రభుత్వం పరిష్కరించడంలేదని విమర్శించారు.

ఓవైపు ఆసరా పథకమంటూ పేదలకు వృద్దులకు సక్రమంగా పించన్లను సైతం అందించలేకపోతోందన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోందన్నారు. పింఛన్లు రాలేదని వృద్దులు కూడా నిరసనలు వ్యక్తంచేస్తున్నారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో, ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌లో కొందరు స్వార్ధపూరితంగానే పార్టీలో చేరుతున్నారని, తమ పార్టీనుంచి అనేకమంది ఎన్నో నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నవారు ప్రస్తుతం పదవులనాశించి వెళ్లినవారేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న బాధిత కుటుంబాలకు 50వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణా యూనివర్సిటీకి నిధులు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి కె.రాజమల్ల్లు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *