Breaking News

వరుత్తరాచ సాంబార్

కావలసినవి:

 కందిపప్పు – పావు కప్పు
పసుపు – పావు టీ స్పూను
పచ్చిమిర్చి – 4
చిలగడదుంప ముక్కలు – అర కప్పు
ఉల్లి తరుగు – అరకప్పు
మునగకాడ – 1 (పెద్ద సైజు
ముక్కలుగా కట్ చేయాలి)
క్యారట్ – 1
బెండకాయ ముక్కలు – అర కప్పు
టొమాటో ముక్కలు – అర కప్పు
వంకాయ – 1
చింతపండు – నిమ్మకాయ సైజు పరిమాణంలో
సాంబారు ఉల్లిపాయలు – 10
కరివేపాకు – నాలుగు రెమ్మలు
కొబ్బరితురుము – అర కప్పు
మెంతుల పొడి – పావు టీ స్పూను
ఇంగువ – పావు టీ స్పూను
ధనియాల పొడి – 2 టేబుల్‌స్పూన్లు
కారం – టీ స్పూను

 పోపుకోసం
ఆవాలు – టీ స్పూను
కొబ్బరినూనె – టేబుల్ స్పూను
మినప్పప్పు – టీ స్పూను
ఎండుమిర్చి – 2
కరివేపాకు – రెండు రెమ్మలు

 తయారి:

  •  ఒక గిన్నెలో తగినంత నీరు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిలగడదుంప, క్యారట్, కీర, బెండ, వంగ, టొమాటో… ముక్కలు వేసి ఉడికించాలి.    
  •  కొద్దిగా ఉడికిన తరవాత మునగకాడలు, చింతపండు రసం వేయాలి.    
  •  కందిపప్పుకి తగినంత నీరు జత చేసి కుకర్‌లో ఉంచి, ఆరు విజిల్స్ వచ్చాక దించేయాలి.    
  •  బాణలిలో మెంతులపొడి వేసి కొద్దిగా వేయించి, తీసేయాలి.    
  •  అదే బాణలిలో కొబ్బరి తురుము, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.     
  •  ధనియాలపొడి, కారం, ఇంగువ, మెంతులపొడి, పసుపు వేసి బాగా కలపాలి.    
  •  చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.    
  •  ఉడుకుతున్న కూరముక్కలలో ఈ పేస్ట్ వేసి కలిపి, బాగా మరిగాక దించేయాలి.    
  •  బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి సాంబార్‌లో వేసి కలపాలి.

– సునయన

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

62 అడుగుల జుట్టు!

ప్రత్యేకం: జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. మహిళలు కేశాలపై అమితమైన ప్రేమను చూపుతుంటారు. రకరకాలుగా అందమైన జడలు అల్లి ఆకట్టుకుంటారు. అంతేకాదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *