Breaking News

ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్య‌క్షుడిగా మామిడి నారాయ‌ణ -తెలంగాణ ఉద్యోగ సంఘం ఏక‌గ్రీవంగా ఎన్నిక – హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ఉద్యోగులు, మండల ప్ర‌జ‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : జ‌క్రాన్ ప‌ల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన మామిడి నారాయ‌ణ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్య‌క్షునిగా ఎంపికైయ్యారు. నిరుపేద కుటుంబంలో జ‌న్మించిన నారాయ‌ణ 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అర్గుల్ లోని జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో చ‌దువుకున్నారు. ఆర్మూర్ లో ఇంట‌ర్ మీడియ‌ట్, హైద‌రాబాద్ లో డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. అనంత‌రం హైద‌రాబాద్ లోని  ఉస్మానియా యూనివ‌ర్సిటి లో ఎంఎస్ సీ పూర్తి చేశారు. చ‌దువు పూర్తైన త‌రువాత గురుకుల పాఠ‌శాల అద్యాప‌కుడిగా నియ‌మించ‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ గురుకుల పాఠ‌శాల ప్రిన్సిప‌ల్ గా కొన‌సాగుతున్నారు. ప్రిన్సిప‌ల్ గా కొన‌సాగుతూనే తెలంగాణ ఉద్య‌మంలో ఉద్యోగ జేఏసి ఆద్వ‌ర్యంలో చురుకుగా పాల్గొన్నారు. దాంతో పాటు తెలంగాణ ఉద్యోగ సంఘంలో రాష్ట్ర ప్ర‌దాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతూ ఉద్యోగుల సంక్షేమానికి, హ‌క్కుల కోసం పాటుప‌డ్డారు. గ‌తంలో ఉన్న ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు విఠ‌ల్ ను ప్ర‌భుత్వం టిఎస్ పిఎస్ సి స‌భ్యుడిగా నియ‌మించ‌డంతో అధ్య‌క్ష ప‌ద‌వి ఖాళీ ఏర్ప‌డింది. దీంతో ఆదివారం ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు హాజ‌రై ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న మామిడి నారాయ‌ణను రాష్ట్ర అద్య‌క్షునిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ప‌ల్లెటూరిలో పుట్టి  అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్య‌క్షునిగా ఎంపిక కావ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగులు, అర్గుల్ గ్రామ‌స్తులు, స‌న్నిహితులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మొద‌టి నుండి తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి పోరాటం చేసిన నారాయ‌ణకు అద్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌డం ప‌ట్ల ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు.

Check Also

అసెంబ్లీ అండర్‌ టేకింగ్‌ కమిటీ చెర్మెన్‌గా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ అండర్‌ టేకింగ్‌ కమిటీ చెర్మెన్‌గా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *