Breaking News

ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ను అమ‌లు చేయాలి -పిడిఎస్యూ డిమాండ్

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : రాష్ట్ర ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసి నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని పిడిఎస్యూ జిల్లా కార్య‌ద‌ర్శి నిమ్మ‌ల నిఖిల్ డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ను విడుద‌ల చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం మొద‌టి ద‌శ‌లో రూ. 500 ల‌కోట్లు విడుద‌ల చేసి ఆ త‌రువాత విడుద‌ల చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ఫాస్ట్ ప‌థ‌కాన్ని వెంట‌నే అమ‌లు చేసి స్కాల‌ర్ షిప్ ల‌ను ముంజూరు చేయ‌క‌పోవ‌డంతో ప్రైవేట్ విద్యా సంస్థ‌ల వారు ఫీజులు చెల్లించని విద్యార్థుల‌కు స‌ర్టిఫికేట్లు ఇవ్వ‌కుండా వేదిస్తున్నార‌ని వివ‌రించారు. విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న బ‌కాయిల‌ను విడుద‌ల చేయాని ఆయ‌న కోరారు.

Check Also

వందశాతం వరి ధాన్యం కొనుగోలు చేయాల‌ని ముఖ్యమంత్రి నిర్ణయం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ధాన్యం కొనుగోలు ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *