Breaking News

Daily Archives: December 30, 2014

ఊట్‌ప‌ల్లికి జిల్లాస్థాయి ప‌ర్యావ‌ర‌ణ మిత్ర అవార్డు

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌30:  బోద‌న్ మండ‌లం ఊట్‌ప‌ల్లి మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల (తెలుగుమీడియం)కు 2013-14 సంవ‌త్స‌రానికి జిల్లా స్థాయి ప‌ర్యావ‌ర‌ణ మిత్ర అవార్డును మంగ‌ళ‌వారం స‌ర్వ‌శిక్షా అభియాన్ ఆర్‌వియం రాష్ట్ర కార్యాల‌యం- గోదావ‌రి అడిటోరియం హైద‌రాబాద్ నందు  అందించారు. ఈ అవార్డును రాష్ట్ర అడిష‌న‌ల్ డైర‌క్ట‌ర్ జి.గోపాల్‌రెడ్డి, ఆర్‌వియం రాష్ట్ర మానిట‌రింగ్ అధికారి సురేష్‌బాబు, ప‌ర్య‌వ‌ర‌ణ మిత్ర రాష్ట్ర ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ ఇందిరా ప్ర‌కాష్ చేతుల మీదుగా ఊట్‌ప‌ల్లి ప్రాథ‌మిక పాఠ‌శాల ప్ర‌దానోపాద్యాయులు ఎన్‌.సంజీవ్‌కుమార్‌, ఇంచార్జి ఉపాద్యాయులు ధ‌న్‌రాజ్‌కు ప్ర‌శంసాప‌త్రంతోపాటు ప‌ర్యావ‌ర‌ణ మిత్ర అవార్డును  ...

Read More »

జోగినిలకు ఆసరా… సఫాయిల కార్మికుల వేతనాల పెంపు… పిడమర్తి రవి, ఛైర్మన్‌, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌

నిజామాబాద్‌, డిసెంబరు 30; రాష్ట్రంలో ఉన్న జోగినిలందరికి ఆసరా పథకం ద్వారా పెన్షన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని, అందుకు వారి సమస్యలను కెసిఆర్‌ దృష్టికి తీసుకువెళతానని, అలాగే గ్రామంలో పని చేసే సఫాయి కార్మికుల వేతనాలను పెంచేందుకు ప్రయత్నాలుచేస్తానని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన దళిత విద్యవంతుల వేదిక, సంసఘ వికాస స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో టిఎన్‌జివోస్‌ భవన్‌లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో జోగిని వ్యవస్థ ఉండటం ...

Read More »

హామిలను టిఆర్‌ఎస్‌ నెలబెట్టుకుంది… ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30, టిఆర్‌ఎస్‌ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నింటి నెరవెరుస్తు తనమ మాటపై కట్టుబడిందని, ఇప్పటి వరకు ఇచ్చిన మాట ప్రకారం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తోంది అని రాష్ట్ర ఎస్‌సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పెడమర్తి రవి అన్నారు. నిజామాబాద్‌లోని నగరంలో ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పేదలకు గృహ నిర్మాణం కోసం, వృద్ధులు, వికలాంగులకు ఫింఛన్‌ ...

Read More »

విద్య కాషాయకరణను మానుకోవాలి… లిబరేషన్‌ జాతీయ నాయకులు మూర్తి

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబర్‌ 30; నరేంద్రమోడి ప్రభుత్వం దేశంలో విద్య వ్యవస్థను విద్య కాషాయకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే విరమించుకోవాలని సిపిఎం(ఎంఎల్‌) లిబరేషన్‌ కేంద్ర కమిటి సభ్యులు ఎన్‌.మూర్తి డిమాండ్‌ చేసారు. ఎఐఎస్‌ఏ ఆధ్వర్యంలో విద్యరంగ సమస్యలపై సదస్సును నిర్వహించారు. మంగళవారం పాత అంబేద్కర్‌ భవన్‌లో సదస్సు జరిగింది. ప్రైవేటికరణ పేరుతో విద్య వ్యవస్థను మతమాడ్యంలోకి మారుస్తున్నరని విమర్వించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్‌ జిల్లా అధ్యక్షులు జి.లక్ష్మినారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ...

Read More »

5వ రోజుకు కార్మికుల సమ్మె

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 30; సుఖ్‌జిత్‌ స్టార్స్‌ మిల్‌లోని కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో అయిదో రోజుకు చేరింది. గత అయిదు రోజులుగా కార్మికుల సమస్యల పరిష్కారించాలని కోరుతూ సమ్మె చేస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే డిసిఎల్‌ వ్ద పది సార్లుకు పైగా చర్చలు జరిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కార్మికులు తప్పనిసరై సమ్మెకు దిగారు. 15 రోజులకు ముందే తమ సమస్యలు పరిష్కారించాలని లేనిచో సమ్మె చేస్తామని యాజమన్యానికి నోటీసు ఇచ్చారు. యజమాన్యాలు దిగి రాకపోవడంతో సమ్మె దిగారు. ఈ సందర్భంగా ...

Read More »

రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ… నేరాల అదుపుపై సమీక్ష

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 30; నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కాచిగూడా రూరల్‌ డీఎస్పీ జగదీశప్ప సోమవారం స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్‌లోని పోలీసు స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రధానంగా స్టేషన్లలో జరుగుతున్న నేరాల తీరు, నేరాస్థుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. స్టేషన్‌లోని 3 ప్లాట్‌ఫామ్స్‌పై నేరాల అదుపునకు పోలీసులను మూడు షిఫ్టులుగా నియమించడం జరిగింది. నేరస్తులు అధునాతన పద్దతిలో నేరాలకు పాల్పడుతున్నందున ప్రయాణికులకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ...

Read More »

కేసిఆర్‌ పాలనపట్ల ప్రజల్లో అసంతృప్తి : మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 తెలంగాణా ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్య ప్రజలు, రైతుల్లో అప్పుడే అసంతృప్తి వ్యక్తమవుతోందని మాజీ మంత్ర పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు, సామాన్య ప్రజలకు, ఉద్యోగులు, కార్మికులకు అన్నివర్గాల వారికి న్యాయం జరిపించేలా తన హయాంలో ఏఒక్కరు నష్టపోవలసిన అవసరంలేదని ప్రజలను ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చిన కేసిఆర్‌ ఆరు నెలలు గడిచినా సామాన్య ప్రజల సమస్యల పరిష్కరించడంలో ఇంకా ఒక్క అడుగు ముందుకు వేయడంలేదని అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల ...

Read More »

ఏన్ని సంఘాలున్న పని చేసేవారికే ప్రాతినిధ్యం ఎంపి కవిత

నిజామాబాద్‌, డిసెంబరు 28; ప్రజా స్వామ్య దేశంలో ఏ రంగంలోనైనా ఏ పరిశ్రమలోపైనా ఏన్ని సంఘాలైన పెట్టుకోవచ్చవని, అందుకు అందరికి అవకాశాలున్నాయని, అయినప్పటినిక ప్రజ సంక్షేమానికి పని చేసిన వారికే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, వారే మనుగడ సాగిస్తారని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. ఐజెయు అనుబంధ సంస్థ టియుడబ్ల్యుజె జిల్లాప్రథమ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. అంతకు ముందే జ్యోతి ప్రజల్వన చేసిన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఏంతె ఉందని, వారి సహకారంతోనే ప్రజలు ...

Read More »