Breaking News

విద్య కాషాయకరణను మానుకోవాలి… లిబరేషన్‌ జాతీయ నాయకులు మూర్తి

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబర్‌ 30;

నరేంద్రమోడి ప్రభుత్వం దేశంలో విద్య వ్యవస్థను విద్య కాషాయకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే విరమించుకోవాలని సిపిఎం(ఎంఎల్‌) లిబరేషన్‌ కేంద్ర కమిటి సభ్యులు ఎన్‌.మూర్తి డిమాండ్‌ చేసారు. ఎఐఎస్‌ఏ ఆధ్వర్యంలో విద్యరంగ సమస్యలపై సదస్సును నిర్వహించారు. మంగళవారం పాత అంబేద్కర్‌ భవన్‌లో సదస్సు జరిగింది. ప్రైవేటికరణ పేరుతో విద్య వ్యవస్థను మతమాడ్యంలోకి మారుస్తున్నరని విమర్వించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్‌ జిల్లా అధ్యక్షులు జి.లక్ష్మినారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా కాషాయీకరణను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. రామ చెన్నయ్య కమీషను చెప్పినట్లుగా నిధులను విద్యకు కేంద్ర, రాష్ట్ర బడ్జెటులో 10%, 30% వరకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 2015-16 విద్యా సంవత్సరాలలో కెజి టు పిజి వరకు ఉచిత విద్యా నిర్భంధనలను అమలు చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌లను విడుదల చేయడమే కాక కార్పొరేట్‌ విద్యా సంస్థలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని తగిన చర్యలను తీసుకోవాలన్నారు. ఆడవారిపై ఎటువంటి దాడులు జరుగకుండా ప్రవేశపెట్టిన నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇట్టి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేని యెడల భారీ ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌, రాణి, భాస్కర్‌, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ పథకాల నిధులు క్రింది స్థాయికి చేరే విధంగా కషి చేద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదల చేసే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *