Breaking News

కేసిఆర్‌ పాలనపట్ల ప్రజల్లో అసంతృప్తి : మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28

తెలంగాణా ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్య ప్రజలు, రైతుల్లో అప్పుడే అసంతృప్తి వ్యక్తమవుతోందని మాజీ మంత్ర పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు, సామాన్య ప్రజలకు, ఉద్యోగులు, కార్మికులకు అన్నివర్గాల వారికి న్యాయం జరిపించేలా తన హయాంలో ఏఒక్కరు నష్టపోవలసిన అవసరంలేదని ప్రజలను ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చిన కేసిఆర్‌ ఆరు నెలలు గడిచినా సామాన్య ప్రజల సమస్యల పరిష్కరించడంలో ఇంకా ఒక్క అడుగు ముందుకు వేయడంలేదని అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఆవిర్భావించి 130 సంవత్సరాలైన సందర్జంగా ఈ నెల 30వ తేదీన బోధన్‌లో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నల 31నాటికి కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు 4లక్షల 20వేలు పూర్తవుతుందని ఈ సభ్యత్వాన్ని ఈ సభకు హాజరయ్యే ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఎఐసిసి కార్యదర్శి కుంతియా, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ్యయ్మ, జానారెడ్డిల సమక్షంలో అందజేయనున్నట్లు మంత్రిచెప్పారు. తెలంగాణా రాష్ట్రాన్ని బంగాదు తెలంగాణాగా మారుస్తామని అందుకు వ్యవసాయరంగానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏఒక్క ఎకరా కూడా పంటలు ఎండిపోకుండా నీరందించేలా సాగునీరందిస్తానని నమ్మించిన కేసిఆర్‌ ప్రస్తుతం కరెంటు కూడా సరిగా ందించలేని దుస్థితిలో రైతాంగం పంటలు పంటక, పెట్టుబడుల ఖర్చులు పెరిగి అప్పుల భారంతో మానసికంగా ఆందోళనచెందుతున్నారని అన్నారు. తెలంగాణాలో అత్యధికంగా పంటలు బోరుబావులపై ఆధారపడి సాగవుతుండగా సాగునీటి కలువల మరమ్మతులు సకాలంలో చేపట్టవలసివన ప్రభుత్వం సరైన అవగాహన లేక రైతాంగం తీవ్ర నష్టాల నెదుర్కొంటుందన్నారు. సాగునీటి కాలువల నిర్మాణాలకు ప్రభుత్వం అనవసరంగా వ్యయాన్ని పెంచకుండా నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించవలసి ఉందన్నారు. ఇంజనీర్లు అందుకు తగిన విధంగా కాలువల రూపకల్పన చేయాల్సి, అవసరముందన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ అని ప్రభుత్వం ప్రకటించి ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం 25వేలు మాత్రమే బ్యాంకుల్లో జమచేసి వారి ఆర్థికంగా మరింత కష్టాలపాల్జేస్తోందని అన్నారు. రైతులను మరింత కుంగదీస్తోందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నారని మంత్రి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో సత్వర నిర్ణయాలుతీసుకుంటుందని, ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వ హయాంలో సాగునీటి వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. సామాన్య ప్రజలకు నిత్యావస సరుకుల ధరలు పెరగి పోయితీవ్ర ఆందోళనచెందుతున్నారని ప్రభుత్వం సామాన్యులకష్టాలను సైతం పట్టించుకోని దుస్థితిలో ఉందన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు సామాన్యులకు ఎంతో చేరువయ్యాయని నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీకి కొండంత అండగా ఉన్నారని అన్నారు. ఈ నెల 30న నిర్వహించనున్న సమావేశానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌, గడుగు గంగాధర్‌, అంతిరెడ్డి రాజరెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ సుమన్‌, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మునీర్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *