Breaking News

హామిలను టిఆర్‌ఎస్‌ నెలబెట్టుకుంది… ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30,

టిఆర్‌ఎస్‌ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నింటి నెరవెరుస్తు తనమ మాటపై కట్టుబడిందని, ఇప్పటి వరకు ఇచ్చిన మాట ప్రకారం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తోంది అని రాష్ట్ర ఎస్‌సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పెడమర్తి రవి అన్నారు.

నిజామాబాద్‌లోని నగరంలో ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పేదలకు గృహ నిర్మాణం కోసం, వృద్ధులు, వికలాంగులకు ఫింఛన్‌ ఇప్పటికి అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు ప్రజలు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేసారు.

గత ప్రభుత్తంతో పోలిస్తే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజ సమస్యలను పరిష్కారించడంలో ముందు ఉందన్నారు. రాజకీయ లబ్ది కోసం టిడిపి లాంటి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నయని, ప్రజలు వాటిని గమనిస్తున్నరన్నారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *