Breaking News

రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ… నేరాల అదుపుపై సమీక్ష

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 30;

నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కాచిగూడా రూరల్‌ డీఎస్పీ జగదీశప్ప సోమవారం స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్‌లోని పోలీసు స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రధానంగా స్టేషన్లలో జరుగుతున్న నేరాల తీరు, నేరాస్థుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. స్టేషన్‌లోని 3 ప్లాట్‌ఫామ్స్‌పై నేరాల అదుపునకు పోలీసులను మూడు షిఫ్టులుగా నియమించడం జరిగింది. నేరస్తులు అధునాతన పద్దతిలో నేరాలకు పాల్పడుతున్నందున ప్రయాణికులకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నేరాలు, భద్రత చర్యలపై సమీక్షించారు. తనిఖిలో నిజామాబాద్‌ రైల్వే పోలీసు స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.సాయినాథ్‌, హెడ్‌కానిస్టేబుల్స్‌, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *