Breaking News

5వ రోజుకు కార్మికుల సమ్మె

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 30;

సుఖ్‌జిత్‌ స్టార్స్‌ మిల్‌లోని కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో అయిదో రోజుకు చేరింది. గత అయిదు రోజులుగా కార్మికుల సమస్యల పరిష్కారించాలని కోరుతూ సమ్మె చేస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే డిసిఎల్‌ వ్ద పది సార్లుకు పైగా చర్చలు జరిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కార్మికులు తప్పనిసరై సమ్మెకు దిగారు. 15 రోజులకు ముందే తమ సమస్యలు పరిష్కారించాలని లేనిచో సమ్మె చేస్తామని యాజమన్యానికి నోటీసు ఇచ్చారు. యజమాన్యాలు దిగి రాకపోవడంతో సమ్మె దిగారు. ఈ సందర్భంగా సుఖ్‌జిత్‌ స్టార్స్‌మిల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.సురేష్‌, కార్యదర్శి అబ్దుల్‌ లతీఫ్‌లు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులకు కూడా రూ.6 వేలకు మించి వేతనాలు ఇవ్వడం లేదని, సాధారణ సెలవులు తీసుకుంటే కూడా వేతనంలో కోత పెడుతున్నారన్నారు. ఇతర జిల్లాలోని మిల్లులో పది సంవత్సరాల కంటే ఎక్కువ పని చేసిన వారికి రూ.20 వేల వేతనాలు ఇస్తున్నారని, ఇదే తరహాలో వేతనాలు తమకు చెల్లించాలని డిమాండ్‌ చేసారు. కార్మిక శాఖ అధికారులు స్పందించి ఫ్యాక్టరీ యజమాన్యాంపై చర్య తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ...

Comment on the article