Breaking News

ఏన్ని సంఘాలున్న పని చేసేవారికే ప్రాతినిధ్యం ఎంపి కవిత

నిజామాబాద్‌, డిసెంబరు 28;

ప్రజా స్వామ్య దేశంలో ఏ రంగంలోనైనా ఏ పరిశ్రమలోపైనా ఏన్ని సంఘాలైన పెట్టుకోవచ్చవని, అందుకు అందరికి అవకాశాలున్నాయని, అయినప్పటినిక ప్రజ సంక్షేమానికి పని చేసిన వారికే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, వారే మనుగడ సాగిస్తారని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. ఐజెయు అనుబంధ సంస్థ టియుడబ్ల్యుజె జిల్లాప్రథమ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. అంతకు ముందే జ్యోతి ప్రజల్వన చేసిన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఏంతె ఉందని, వారి సహకారంతోనే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆంథ్ర చానల్లే, పేపర్లు ఏం తప్పులు రాసిన పట్టించుకోలేదన్నారు. అంథ్ర యజమాన్యాల చేతుల్లో పని చేసిన తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని తెలంగాణకు అనుకూలంగా రాతలు రాయడం గమనర్హం అన్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రతినిధులు పలు డిమాండ్లను ఆమె ముందు ఉంచారు.వీటిపై స్పందించిన కవిత తప్పకుండా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, బీమా విషయంలె లెక్నికల్‌ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారించి, ప్రతి జర్నలిస్టులకు భీమా వసతి కల్పిస్తామన్నారు. అలాగే జిల్లలో జర్నలిస్టులందరికి మా ఎమ్మెల్యే బీమా సోమ్ము చెల్లిస్తామన్నారు. ఇళ్ల స్థలాలను ఇప్పించి తప్పకుండా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులతో ఏంతో అనుభంధం ఉందని, వారి కారణంగా, వారి సూచనల మేరకు 30 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు రెండు యూనియన్లు ఉండటం సరికాదని, పెద్ద యూనియన్‌ అయిన టియూడబ్ల్యుజెనే ముందడుగు వేసి పోటీ యూనియన్‌ కలుపుకోని పోవాలని సూచించారు. ఇందుకు ఐజెయు సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా అందుకు మేం సిద్దంగా ఉన్నామని, ఈ వేదికనే నుంచి పిలుపునిస్తున్నామన్నారు. ఐజెయు జాతీయ కార్యదర్శి అమర్‌ సుదీర్ఘ ప్రసంగం చేసి జర్నలిస్టుల ఉద్యమ విధానం, తీరున వివరించారు. ఈ సభలో యూనియన్‌ జాతీయ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌, కార్యదర్శి వీరత్‌అలీ మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *