Breaking News

న్యూఇయర్‌ తనిఖీలు… న్యూసెన్స్‌ చేస్తే కేసులు; సిఐ నర్సింగ్‌యాదవ్‌

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 31;

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏలాంటి న్యూసెన్స్‌ చేసిన కేసులు నమోదు చేస్తామని నిజామాబాద్‌ నగర సిఐ నర్సింగ్‌యాదవ్‌ అన్నారు. రెండు రోజులుగా న్యూఇయర్‌ వేడుకలను పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మోటర్‌ సైకిళ్లపై ఇద్దరిని మించి ప్రయాణం చేయరాదని, మోటర్‌ సైకిళ్ల సైలెన్సర్లను తీయ్యారాదని, నగరంలో 60కిలో మీటర్లకు మించిన వేగంతో వేళ్లరాదని సూచనాలు చేసారు. ఈ మేరకు కంఠేశ్వర్‌ ప్రాంతంలో వాహనాల తనిఖీలను చేపట్టారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడిపి వారిని, వాహనాలకు ఇన్సూరెన్స్‌, ఆర్‌సీ బుక్కులను తనిఖృలు చేసారు. సరైన ఆధారాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. రెండు రోజుల పాటు నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ ఉంటుందని, వాహనాలను అకస్మీకంగా తనిఖీ చేస్తామని అన్నారు.

Check Also

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *