Breaking News

న్యూ ఇయర్‌ సంబరాలకు సిద్దం… యువత కేరింతలు షూరూ… మార్కెట్‌ అంతా బిజి బిజి

నిజామాబాద్‌, డిసెంబరు 31 ;

2014 సంవవత్సరం ముగియడంతో నూతన సంవత్సరం 2015కు స్వాగతం పలుకుతూ సర్వం సిద్దం అయింది. న్యూ ఇయర్‌ వేడుకలకు యువత సిద్దం అయి, రాత్రి పన్నెండు గంటలకు వివిధ రూపాల్లో వేడుకలను జరుపుకునేందుకు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే కేక్‌లు, టపాకాయాల మార్కెట్లు కోనుగోల్లు బిజి బిజిగా మారాయి. వైన్స్‌ల చుట్టు చేరి జనం మందును కోనుగోళ్లను ఇప్పటికే పూర్తి చేసారు. దీనికి తోడు తెల్లవారితే నూతన సంవత్సరంతో పాటు గురువారం రావడంతో దానికి తోడుగా వైకుంఠ ఏకదాశి రావడంతో ప్రతి ఒక్కరు ప్రత్యేకదినంగా బావిస్తున్నారు. మరోపక్క చర్చిలు, మందిరాలు, మసిదులు పూజలకు సిద్దం అయ్యాయి. దేవాలయాలను సిద్దం చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. సాయిబాబా మందిరాల్లో ఏర్పాట్లు చేసారు.

పార్టీలకు సిద్దం

నూతన సంవత్సర వేడుకలకు పార్టీలకు యువత అంతా పార్టీలు చేసుకునేందుకు సిద్దం అవుతున్నారు. తినుబండరాలు, మంసాహారం, మద్యంతో పాటు ఆట, పాట చేసేందుకు ఏర్పాట్లు చేసారు. విందు వినోదాలతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు సన్నద్దం అయ్యారు. చికెన్‌ ప్రియుల కోసం ఇప్పటికే అయా హోటళ్లు ప్రత్యేక వంటకాలను తయారు చేసి గత వారం రోజులుగా విఫరితంగా ప్రచారం చేసారు. కిలో చికెన్‌ తీసుకుంటే చాపతీలు ఫ్రీ అంటు ముమ్మరంగా ప్రచారం చేసారు.

సరికొత్త ఆఫర్లు…

న్యూఇయర్‌ కేకులు ప్రధాన అకర్షణగా మారాయి. అన్ని స్వీట్‌ హోమ్‌ల్లో, బేకరీలలో ఏర్పాట్లు చేసారు. రూ.150ల కిలో కేక్‌ను రూ.100లకే విక్రయించేందుకు ముందస్తుగా సిద్దం చేసారు. బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ మొబైల్‌ షాపులో ఏకంగా ఒక సిమ్‌ కార్డు కొంటే చికెన్‌ లేదా మటన్‌ బిర్యానీ ఉచితం అంటు ప్రచారం చేసారు. చికెన్‌, మటన్‌లకు మరింత గీరాకి పెరిగింది. ప్రత్యేకంగా వంటకాలతో పాటు వీటితో ఉచితంగా బీరు, సిమ్‌ కార్డులు, కేక్‌లను ఆఫర్‌ చేస్తున్నారు. ఇదే తరహాలో డైరీలు, క్యాలండర్లు అమ్మకాల్లోనూ ఇదే తీరు కొనసాగుతుంది. అలాగే బార్లలో, వైన్స్‌లలోనూ కూడా రెండు బీర్లు కొంంటే ఒక ఉచితం, ఒక్క బిర్యానీ కొంటే మరో బిర్యానీ ఉచితం అంటు ముమ్మరంగా ప్రచారం చేసారు. దీంతో యువత అంతా తమకు నచ్చిన వంటకాలు, తినుబండరాలతో పాటు ఇతర కొనుగోల్లపై దృష్టిసారిస్తున్నారు.

పోలీసుల భద్రత…

నూతన సంవత్సర వేడుకలను పురష్కారించుకొని నగరంలో పోలీసులు విస్త్రత బందోబస్తు ఏర్పాటు చేసారు. పోకిరిలు ఏలాంటి వివాదాలు సృష్టించకుండా ఉండేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టడం చేస్తున్నారు. మోటర్‌సైకిళ్లపై రెజింగ్‌లు చేయకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాలు జరిగే స్థలాల్లో ప్రమాద సూచికలను ఏర్పాటు చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహారించి వివాదాలకు కారణం అయ్యే వారిపై కేసులు నమోదు చేస్తామని నగర డిఎస్పీ అనంద్‌కుమార్‌ హెచ్చరించారు.

Check Also

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *