Breaking News

2014లో కీలక ఘట్టాలు…

నిజామాబాద్‌ ప్రతినిధి

జనవరి – 13 భారత మహిళా క్రికెట్‌ ఏ జట్టుకు నిజామాబాద్‌కు చెందిన మహిళ క్రికెటర్‌ స్నేహామోరె ఎంపిక అయింది. 20న బాల్కోండలో అర్థరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. అయిదు ఇళ్లలో, రెండు దుకాణాలను లూటీ చేసారు. ఈ తరహా దోపిడీ జరగడం ఇదే మొదటిసారి.

ఫిబ్రవరి – 9న జుక్కల్‌ చౌరస్తాలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాప ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

20న నిజామాబాద్‌ నగరంలోని గంగాస్థాన్‌కు చెందిన రఘువీర్‌రెడ్డి ముగ్గురు కుమార్తెలను ఆయన సోదరుడు నరేందర్‌రెడ్డి నగర సమీపంలో సజీవ దహనం చేసాడు. అనంతరం నరేందర్‌రెడ్డి బాసర సమీపంలోని గోదావరి నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

మే – 30న ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గేట్‌ వద్ద కంటైనర్‌, మోటర్‌ సైకిల్‌ డీ కొని బాబుతో పాటు నలుగురు మృతి చెందారు.

జూన్‌ – 19న మోర్తాడ్‌ మండలం గాండ్లపేట వద్ద కారు డీసీఎం ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇందులో శిశువు, బాలింత ఉండటం విషాదకరం.

ఆగస్టు – 19 సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వం ప్రతిష్టాత్వకంగా నిర్వహించింది.

సెప్టెంబరు – 9న ఆర్మూర్‌ డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్‌ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని డీకొని అక్కడికక్కడే దగ్థం అయింది. డ్రైవర్‌ గంగాధర్‌ ప్రమాదంలో మరణించారు.

30న ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించింది.

అక్టోబరు – 4న దసరా పండుగ రోజున వర్ని మండలం అక్భర్‌నగర్‌ వద్ద ఆటో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఇందులో కోల్లూర్‌ సర్పంచ్‌ మాధవి, పోతంగల్‌ వార్డు మెంబరు గంగామణి, మరో మహిళ ఉన్నారు. 22న నగరంలోని వినాయకనగర్‌లో సెప్టిక్‌ ట్యాంకులో దిగిన నలుగురు కార్మికుల మృతి.

నవంబరు – ఎల్లారెడ్డి మండలం ఆచాయిపల్లిలో జరిగిన మొహరం పండగలో జాతరలో విద్యుత్తు షాక్‌ తగిలి వ్యక్తి మృతి. 21నఫెన్సిడిల్‌ మందు అక్రమ రావాణ, తయారి వెలుగులోకి వచ్చింది.

డిసెంబరు – 15న గృహా నిర్మాణంలో అక్రమాలపై విచారణ చేసి సిఐడి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. 20న క్షుద్రపూజల పేరుతో నగరానికి చెందిన వివాహిత సవితను మూడనమ్మకాలను బలి చేసాడు. పైశాచికంగా హత్య చేసారు.

– నిజామాబాద్‌ నగరానికి చెందిన నిఖిత్‌ జరీనా ఏసియన్‌ స్పోర్స్ట్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో బంగారు పతకం సాదించారు. జిల్లాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఎంపిక అయ్యారు.

– జిల్లాకు చెందిన రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన మలావత్‌ పూర్ణ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి జిల్లాకు చేరారు.

– జిల్లాలోని మెడికల్‌ కళాశాలకు పి.జి కోర్సు మంజూరు. ఎంసిఐ బృందం పరిశీలన.

– సమగ్ర కుటుంబ సర్వే, సామాజిక సర్వే, ఆధార్‌ అనుసంధానం, ఆసరా పెన్షన్ల సర్వేలో రాస్త్రంలో ప్రథమ స్థానం.

– పంట నష్టం, సాగునీటి కొరతతో పంట దిగుబాటు లోటు.

Check Also

అన్నం పరబ్రహ్మ స్వరూపం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *